Saturday, January 15, 2011

ఎమ్మెల్యేలు ‘' పందెంకోళ్లు '’

kodipandalu
సంక్రాంతి పర్వ దినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత రసవత్తరంగా కోడిపందాలు ప్రారంభ మయ్యాయి. శుక్రవారం ఉదయం తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య పోలీసులు అనుమతి ఇస్తారా ? లేదా? అనే సందిగ్ధ వాతావరణం మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. చివరకు ప్రజాప్రతి నిధుల ఒత్తిడి వలన పోలీసు శాఖ చేతులెత్తేయక తప్పలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి తోట నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గంలో మంత్రి అనుచరులు కోడిపందా లలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇక్కడ మహిళలు కోడిపందాలకు రావడం విశేషం. కోళ్ళకు హారతులు ఇచ్చి, వీరగంధం పూసి, బొట్టుపెట్టి పందాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అదేవిధంగా అల్లవరం నియోజకవర్గం పరిధిలో మంత్రి పినిపే విశ్వరూప్‌ అనుచరులు పెద్త ఎత్తున కోడిపందాలలో పాల్గొ న్నారు. అమలాపురం ప్రాంతంలోనూ, గోడితిప్ప, గోలిలంక, ముమ్మడివరం ఇతర లంక గ్రామాలలో పాండిచ్చేరి రాష్ర్టంలోని యానాం పరిధిలోమంత్రి మల్లాడి కృష్ణారావు అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

mls 

ప. గో.జిల్లాకు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేల రాక: ఒకవైపున రాష్ర్టంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల స్థాయి ఉధృతమై, ఇరు ప్రాంత నేతలు కత్తులు దూసుకుంటున్న సమయంలో సంక్రాంతి పండుగ సమైక్య గీతానికి శ్రీకారం చుట్టినట్ట య్యింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, యలమంచిలి మండలాలలో భారీ స్థాయిలో జరుగుతున్న కోడిపందాలకు హాజరు కావడం విశేషం. సినీ నటులు ఎమ్మెస్‌ నారాయణ, వినాయకుడు ఫేం హీరో కృష్ణుడు కోడిపందాలు తిలకించి, ప్రజలను ఉత్తేజపరిచారు. తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు ఆంధ్రప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలకు హాజరుకావడం రాష్ర్టవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. సంక్రాంతి సెలవుల కారణంగా ఆహ్లాదంగా, ఉల్లాసంగా గడపడానికి, సరికొత్త వాతావరణంలో ప్రజలను కలుసుకోవడానికి వచ్చామ ని, తమకు ఎంతో సంతోషంగా ఉంద ని తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం. వారిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం మ రో విశేషం. కాగా యలమంచిలి మం డలం కలగంపూడి గ్రామంలో ప్రత్యే కంగా కోడిపందాల నిర్వహణ కోసం కొబ్బరితోటను నరికి వేసి, శుభ్రం చేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో షామియానాలతో అలం కరించి అక్కడ జోరుగా పందాలు నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూ రి ప్రసాదరాజు కోడిపందాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

తెలంగాణ ఎమ్మెల్యేలు వీరే: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్‌ (ఖుత్బుల్లాపూర్‌), ఆకుల రాజేందర్‌ (మల్కాజ్‌గిరి), నందీశ్వర్‌గౌడ్‌ ( పటాన్‌చెర్వు), లక్ష్మారెడ్డి (మేడ్చల్‌) కోడిపందాలకు హాజరయ్యారు. భీమవరం సమీపంలోని చింతలపాటి దొడ్డి, యలమంచలి మండలం కలగంపూడి గ్రామంలో జరిగిన కోడి పందాలలో వీరు పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్‌ మేకా శేషుబాబు పాల్గొనగా, దెందులూరు నియోజక వర్గం పరిధిలోని కొప్పాకలో ఎమ్మె ల్యే చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన సొంత గ్రామమైన పోలవరం నియోజకవర్గంలోని దుద్దుకూరు లో జరిగిన కోడి పందాలలో పాల్గొ న్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ చింతలపూడి ఆ నియోజకవర్గంలో జరిగిన పందా లలో పాల్గొన్నారు. అమెరికా, ఆస్ట్రే లియా, ఇంగ్లండ్‌ దేశాలలో స్థిర పడిన ఎన్‌ఆర్‌ఐలు కూడా కోడి పందాల్లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment