Sunday, January 16, 2011

నేతలే నిర్వాహకులుగా మూడు రోజుల ముచ్చట * ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందాల నిర్వహణ * రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనం

నేతలే నిర్వాహకులు.. వారికి అమాత్యుల వత్తాసు 
నేతలే నిర్వాహకులుగా మూడు రోజుల ముచ్చట ... 
 ఆదివారంతో ముగిసింది.
ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ కోడి పందాల నిర్వహణ
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనం

రాజకీయ బరిలో జూదాల జాతర యథేచ్ఛగా సాగింది. నేతలే నిర్వాహకులుగా మూడు రోజుల ముచ్చట ఆదివారంతో ముగిసింది. ఈ మూడు రోజుల్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ. 200 కోట్లు పందాల రూపంలో చేతులు మారాయి. సంప్రదాయం ముసుగులో నేతలే కోడి పందాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలే నిర్వాహకులుగా పందాలు వేయడం, అమాత్యులు వారికి వ త్తాసు పలకడంతో సామాన్యులు సైతం ముక్కున వేలేసుకున్నారు. పెద్దపెద్ద టెంట్లు వేసి ఫ్లడ్‌లైట్ల కాంతిలో కూడా కోడి పందాలు నిర్వహించడం విశేషం. వీటితోపాటు పేకాట, గుండాట, కోతాట వంటి జూద క్రీడలు పందాలరాయుళ్ల జేబుకు కోత పెట్టాయి. అనుమతి లేని బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారింది. పందాల దెబ్బకు ఏటీఎంలు సైతం ఖాళీ అయిపోయాయి.

పశ్చిమలో రూ. 150 కోట్లు...



పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 200కు పైగా కేంద్రాల్లో జరిగిన జూద క్రీడలో మూడు రోజుల్లో రూ. 150 కోట్లు చేతులు మారాయి. జిల్లాలోని ఐభీమవరం, జువ్వలపాలెం, కలగంపూడి, భీమవరం ప్రకృతి ఆశ్రమం, గణపవరం ఏజెన్సీ ప్రాంతంలోని శ్రీనివాసపురం వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో పందాలు జరగ్గా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు స్థాయిలో జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, వరంగల్, కృష్ణా, గుంటూరు, తూర్పు, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జూదరులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. తొలి రోజున జిల్లాలో జరిగిన పలు పందాల్లో తెలంగాణకు చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేంద్ర, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే మహేశ్వర్‌గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే రాజిరెడ్డితోపాటు రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు అనంత రామిరెడ్డి, కన్నబాబు రాజు, చింతమనేని ప్రభాకర్, జయమంగళ వెంకటరమణ, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, మద్దాల రాజేష్, పశ్చిమగోదావరి జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు హాజరయ్యారు. శని, ఆదివారాల్లో జరిగిన పోటీల్లో డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గణపవరం జెడ్పీటీసీ నవుడు వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పీవీ నరసింహరాజు, వినాయకుడు చిత్రం హీరో కృష్ణుడు, సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన భారీ కోడి పందాలకు రాజకీయ నాయకులే నేతృత్వం వహించడం విశేషం. ఆకివీడు మండలం ఐ.భీమవరంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కనుమూరి అబ్బాయిరాజు, కలగంపూడిలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జువ్వలపాలెంలో కాంగ్రెస్ నాయకుడు గోకరాజు రామరాజు, ప్రకృతి ఆశ్రమంలో, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతలపాటి నరసింహరాజు, కంతేటి వెంకట్రాజు వంటి రాజకీయ ప్రముఖులు జూదాల బరికి నాయకత్వం వహించి పందాల రాయుళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

‘తూర్పు’న రూ. 50 కోట్లు...


పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాలు భారీ ఎత్తున జరిగాయి. పశ్చిమ స్థాయిలో కాకున్నా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పందాలు కోట్లలో సాగాయి. ముఖ్యంగా కోనసీమలో అల్లవరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పండుగ మూడు రోజుల్లో రోజుకు రూ. కోటిన్నర చొప్పున రూ. నాలుగున్నర కోట్ల పందాలు జరిగినట్లు అంచనా. మెట్టలో కిర్లంపూడి, తుని, కె.మల్లవరం, జగ్గంపేట మండలాల్లో మూడు రోజుల్లో రూ. ఆరు కోట్లకు పైగా చేతులు మారాయి. వీటితోపాటు కపిలేశ్వరపురం, రాయవరం, ద్వారపూడి మండలాల్లో సైతం రోజుకు రూ. కోటి చొప్పున మూడు రోజుల్లో రూ. మూడు కోట్ల పందాలు జరిగాయి. మొత్తం మీద పండుగ పేరు చెప్పి జిల్లాలో కోడిపందాలు, పేకాటలు, గుండాటల ద్వారా రూ. 50 కోట్లు చేతులు మారాయి. ఇందులో ఒక్క కోడిపందాల మీదే రూ. 30 కోట్లు చేతులు మారడం గమనార్హం. పోలీసుల హెచ్చరికతో భోగి రోజున అనుకున్న స్థాయిలో పందాలు జరగకున్నా, మిగిలిన రెండు రోజులు భారీ ఎత్తున సాగడంతో ఆ ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి.


వెక్కిరించిన ఏటీఎంలు...
పందాలరాయుళ్ల దెబ్బకు ఏటీఎంలు తట్టుకోలేకపోయాయి. వాటిలోని సొమ్మంతా జూదరులే ఊడ్చేయడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. బ్యాంకు అధికారుల అంచనాలకు మించి ఏటీఎంల నుంచి నగదును లాగేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శనివారం సంక్రాంతి, తర్వాత ఆదివారం కావడంతో బ్యాంకులకు వరుసగా రెండురోజుల సెలవులు వచ్చాయి. దీంతో శుక్రవారం అన్ని బ్యాంకులు ఏటీఎంలలో భారీగా నగదును ఉంచాయి. కోడి పందాలు, పేకాటలు విచ్చలవిడిగా సాగడంతో జనం ఏటీఎంల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా ఆదివారం ఉదయానికి మొత్తం ఏటీఎంలు ఖాళీ అయ్యాయి.పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు 500కు పైగా ఉన్నాయి. ఒక్కో ఏటీఎంలోనూ కనీసం మొత్తం రూ. 10 లక్షలు, గరిష్టంగా రూ. 20 లక్షల నగదు ఉంచుతారు. అన్ని ఏటీఎంలలో కలిపి సుమారు రూ. 80 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో రూ. 50 కోట్లకు పైగా మొత్తాన్ని రెండు రోజుల్లోనే లాగేశారు. ఇందులో పందెంరాయుళ్ళు చేతుల్లోకి వె ళ్లిన మొత్తమే రూ. 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

పందెం గెలవలేదని...
పందెంలో గెలవలేదని బతికుండగానే కోడి పుంజు ఈకలు పీకేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో జరిగిన కోడి పందాల్లో ఓ కాకి రంగు పుంజు పందెంలో ఓడింది. అప్పటికే పందాల్లో రూ. పది వేల వరకు పోగొట్టుకున్న ఓ జూద ప్రబుద్ధుడు.. వెంటనే దానిపై ప్రతాపాన్ని చూపాడు. పుంజుకు ప్రాణం ఉండగానే ఈకలు పీకేసి కసి తీర్చుకున్నాడు.
 
కోళ్ల కష్టం రూ.150 కోట్లు
కోడిపుంజుల ప్రాణత్యాగాలకు ఖరీదు కట్టే షరాబు లెవ్వరూ లేరుగానీ.. కోళ్ల కష్టంతో చేతులు మారిన కోట్లాది రూపాయలు కొందరికి మోదాన్ని..మరెందరికో ఖేదాన్ని మిగిల్చాయి. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకుల సాక్షిగా మూడు రోజుల పాటు జిల్లాలో జోరుగా సాగిన కోడిపందాల్లో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా. జిల్లాలో దాదాపు 200 కేంద్రాల్లో జరిగిన పందాలకు రాష్ర్టం నలుమూలల నుంచి పందాల రాయుళ్లు జిల్లాకు తరలి వచ్చి కోట్లాది రూపాయల పందాలు కాశారు. ఇక కోడి పందాలకు అనుబంధంగా పేకాట,గుండాట వంటి జూద క్రీడలు కూడా అడ్డూఅదుపు లేకుండా లేకుండా సాగి నిర్వాహకుల జేబులు నింపాయి. బరుల వద్ద మద్యం ఏరులై పారింది.

జిల్లాలో మూడు రోజులపాటు కోడి పందాలు, పేకాటలు యథేచ్ఛగా సాగాయి. రాజకీయ నేతల కనుసన్నల్లో జిల్లా జూదంలో మునిగితేలింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పందాలరాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సంక్రాంతి సంప్రదాయం పేరుతో సాగిన జూద క్రీడలో కొందరు షరాబులు కాగా, మరెందరో గరీబులుగా మారిపోయారు. నిముషాల్లోనే లక్షలు, కోట్లు పందాల రూపంలో చేతులు మారిపోయాయి. జిల్లాలో సుమారు 200 కేంద్రాల్లో అడ్డూ అదుపూ లేకుండా సాగిన జూదాల జాతరలో మూడు రోజులకు సుమారు రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా. 

పధానమైన కేంద్రాల్లో మూడవ రోజు కూడా అదే జోరుతో పందాలు సాగాయి. ఒక మోస్తరు బరిలో మూడవ రోజు ముచ్చట పల్చబడింది. ఇక ఊళ్లు, పేటలకు జూదం విస్తరించింది. మహిళలు పండుగ ఏర్పాట్లలో ఇంటికే పరిమితమైతే అత్యధిక శాతం మంది పురుషులు మాత్రం పందెం కాద్దామనో, జూదం చూద్దామనో బరి వైపు పరుగులు తీశారు. అక్కడే మద్యం సేవిస్తూ కోడి పకోడి, పలావులు ఆరగిస్తూ జేబులో చిల్లరను పేకాట, కోడి పందాల్లో ఒడ్డారు. మూడు రోజుల జాతర ఎటువంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగిపోయింది. జిల్లాలోని అయిభీమవరం, జువ్వలపాలెం, భీమవరం ప్రకృతి ఆశ్రమం, కలగంపూడి, శ్రీనివాసాపురం, గణపవరం వంటి ప్రాంతాలు జూదాల జాతరతో కిటకిటలాడాయి.

అయిభీమవరంలో శనివారం జరిగిన పందాల్లో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పాల్గొన్నారు. కనుమూరి అబ్బాయిరాజు నేతృత్వంలో ఆదివారం కూడా అక్కడ పందాలు సాగాయి. జువ్వలపాలెంలో జరిగిన పందెంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు, డీఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు నరసింహరాజు, భీమవరం కాస్మో క్లబ్ గౌరవాధ్యక్షుడు గోకరాజు రామరాజు పాల్గొన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో శనివారం జరిగిన పందాల్లో సినీ నటుడు శివకృష్ణ, ఆయన కుమారుడు పాల్గొన్నారు. ఆదివారం తెలంగాణా ప్రాంతానికి చెందిన నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ లక్ష్మీనారాయణరెడ్డి, స్వామి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ చైర్మన్ సాయిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొవ్వూరి ప్రభాకరరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ రుద్రరాజు సత్యనారాయణరాజు (పండురాజు) హాజరయ్యారు.
గణపవరంలో మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పసల కనక సుందరం, జెడ్పీటీసీ నౌడు వెంకటరమణ, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు తమ్ముడు పెండ్యాల అచ్చిబాబు, సినీ నిర్మాత దిల్‌రాజు, కలగంపూడిలో ఆదివారం జరిగిన పందాల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. పోడూరు, పాలకొల్లు, యలమంచిలి, మొగల్తూరు మండలాల్లో పందాలు సాగాయి. తాడేపల్లిగూడెం పరిధిలో ఆరుగొలను, లింగారాయుడు గూడెంలో కూడా పందాలు జరిగాయి.

కొవ్వూరు సమీపంలోని వాడపల్లిలో జరిగిన పందాల్లో శనివారం కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు పాల్గొన్నారు. అక్కడ ఫ్లడ్‌లైట్లలో రాత్రి, పగలు పందాలు జరగడం గమనార్హం. విజ్జేశ్వరం బ్యారేజీ వద్ద తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య పందాలు జరిగాయి. పంగిడి, రేచర్ల, రావూరుపాడు, వేగేశ్వరపురం, పోతవరం, దేవరపల్లి తదితర గ్రామాల్లో పందాలు జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసాపురంలో జరిగిన భారీ పందాల్లో డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో వేల్పూరు, ఖండవల్లి, అత్తిలి, అయినపల్లి, కె.ఇల్లింద్రపర్రు ప్రాంతాల్లో పందాలు జోరుగా సాగాయి. భారీ పందాలు జోరుగా సాగగా, ఒక మోస్తరు పందాలు పల్చబడి గ్రామాలు, పేటల వరకు కోడి పందాలు, పేకాటలు విస్తరించాయి.


కోడి పందాలు పేరుతో జోరుగా జూదం
సంక్రాంతి సమయంలో పోలీసులు అడ్డుకున్న ప్రతిసారీ ఇది సంప్రదాయం. కాదంటే ఎలా అంటూ నేతల నుంచి ఎదురు ప్రశ్న వస్తూనే ఉంది. కోడి పందాల వరకు సరేనంటూ అయిష్టంగా పోలీసులు తలూపుతున్నప్పటికి జరుగుతున్నది మాత్రం జూదాల జాతర అని చెప్పక తప్పదు. రాజకీయ అండదండలు కలిగిన నేతలు కోడి పందాలు నిర్వహిస్తే వాటి మాటున పేకాట, గుండాట, కోతాట వంటి గ్యాబ్లింగ్ అడ్డూ అదుపు లేకుండా సాగుతుంది. అయి భీమవరం ప్రాంతంలో బందరుకు చెందిన ఓ వ్యక్తి కేవలం గంటన్నర వ్యవధిలోనే రెండు లక్షల రూపాయలు సంపాదించాడు.

కాళ్ళకూరులో మరో యువకుడు మూడు గంటల వ్యవధిలో కోతాటలో రూ. 75 వేలు ఆర్జించాడు. కేవలం గంటల వ్యవధిలోనే పేకాటలో జాతకాలు తారుమారయిపోయాయి. గ్యాంబ్లింగ్‌లో ఆరితేరిన ముఠాలు కోడి పందాల ప్రాంతంలో మకాం వేశాయి. అంతేకాక పేకాటలు జనం జేబులకు కోత పెట్టాయి. కొందరు యువకులు సొమ్ము ఆర్జించినప్పటికీ అత్యధిక శాతం మాత్రం అయ్యయ్యో జేబులో డబ్బులు పోయాయి అంటూ విషాద గీతాలు ఆలపిస్తూ ఇంటి ముఖం పట్టారు. సంప్రదాయం మాట ఎలా ఉన్నా సాగింది మాత్రం అడ్డూ అదుపూ లేని జూదం మాత్రమే.
పెరిగిన కోడిపందాల హోరు
జిల్లాలో కోడిపందాల జోరు తారాస్థాయికి చేరింది. వరుసగా మూడవ రోజు ఆదివారం జిల్లా నలుమూలలా కోడిపందాలు జరిగాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పందాలు ఊపందుకున్నాయి. పందాలతో పాటు పై పందాలకు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి.ఎక్కడ చూసినా మద్యం ప్రవాహంగా మారింది. కోడిపందాలు వేస్తున్న ప్రాంతాలలో కాకుండా కారుల్లో కూడా మద్యం సేవిస్తూ, కేరింతలు కొడుతూ సంక్రాంతి జోరు ప్రదర్శిస్తున్నారు. ఆదివారం కనుమ పండుగ కావడంతో మాంసం విక్రయాలు కూడా భారీ స్థాయిలో జరిగాయి.

భీమవరం, యలమంచిలి మండలం, ఉండి, ఆకివీడు, ఏలూరు, పెదవేగి, లింగపాలెం, చింతలపూడి, పెదపాడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, నిడదవోలు తదితర మండలాల్లో కోడిపందాలు జోరు ఎక్కువైంది. దీనితో పాటు మూడు ముక్కలాట, పేకాట, గుండాట, కోతాట, లోన బైట పేరిట జూదం లక్షలాది రూపాయలతో యథేచ్ఛగా జరుగుతోంది. కోడిపందాలు జిల్లావ్యాప్తంగా దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు అంచనాలు విన్పిస్తున్నాయి. ఇప్పటి వరకు ముగ్గుల పోటీలతో మహిళలు వినోదాన్ని పంచుకోగా పెద్ద ఎత్తున పురుషులు, వారిలో ఎక్కువగా యువకులు కోడిపందాల వైపు దృష్టి పెట్టారు.

పెదవేగి మండలం కొప్పాకలో శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ సారథ్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని గ్రామాల్లో పార్టీలరహితంగా పందాలు జరుగుతున్నాయి. శనివారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో జరిగిన కోడిపందాలకు సినీ నటుడు కృష్ణుడు, అదేవిధంగా ద్వారకాతిరుమలలో ఎంఎస్‌ నారాయణ హాజరై అందరినీ నవ్విస్తూ కనువిందు చేశారు. శ్రీనివాసపురంలో డిసిసిబి చైర్మన్‌ కరాటం రాంబాబు తదితరులు హాజరయ్యారు. భీమవరం మండలంలోని ప్రకృతి ఆశ్రమం సమీపంలో ఒక స్టేడియంలాగా మారిపోయింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రీ, పగలూ కోడిపందాలు జరుగుతున్నాయి.

ఎన్నారైలు, తెలంగాణా నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పందాలకు హాజరై పందెం రాయుళ్ళకు హుషారు కల్పిస్తున్నారు. ఎన్నారై మహిళలు కూడా పందాలు కాస్తూ వాటిని తిలకిస్తున్నారు.మద్య ప్రవాహం మాత్రం తారాస్ధాయిలో చేరడంతో ఆ శాఖ అధికారులు కూడా ఆనందంలో ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా వారికిచ్చిన టార్గెట్‌ దాటి అమ్మకాలు జరుగుతుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కూడా ఈ కోడిపందాలు జోరు కొనసాగనుంది. ఈ విధంగా ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ, కనుమ పండుగ సందర్భంగా ప్రతీ ఏటా జరిగే విధంగా, సాంప్రదాయబద్ధంగా కొనసాగిస్తున్న కోడిపందాల హోరు కన్పిస్తోంది. 

పుంజు గెలిచింది

సంక్రాంతి సంబరాల ముసుగులో ఖద్దరు చొక్కాల ముందు ఖాకీ యూనీఫారం వెలవెలబోయింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ వ్యవస్థ గత మూడు రోజులుగా జిల్లాలో పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పలువురి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కోడిపందేలలో పాల్గొని ప్రోత్సహించడం తో చట్టం కళ్ళు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం ముసుగు లో కోట్లాది రూపాయలను జూదగా ళ్ళు పందేలలో పణంగా పెట్టారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కోడిపందేల మేళాలో గుండాట, కోతాట, మూ డు ముక్కలాట, 13ముక్కలాట దిగ్విజయంగా నిర్వహించారు. వాస్తవానికి సంప్రదాయం ముసుగులో జరిగిన కోడిపందాలతోపాటు, లక్షలాది రూపాయలు జూదం వివిధ రూపాల్లో జరిగింది. జిల్లాలో సుమారు 200ప్రాంతాలలో జరిగిన కోడిపందాల మేళాలలో కోట్లాది రూపాయలు చేతులు మారా యి.

నిర్వాహకులు జేబులు నింపుకో గా, అనునిత్యం కాయకష్టంచేసి పండ గ దినాలలో కోడిపందాలకు వెళ్ళి సరదాగా గడుపుదామని వచ్చిన కార్మిక వర్గాలు గత నాలుగురోజులలో వేలాది రూపాయలు జూదాలలో పోగొట్టుకుని చివరకు సైకిళ్ళు, బంగారు వస్తువులు తాకట్టులు పెట్టుకుని అప్పుల పాలయ్యారు. జూద కార్యక్రమాలను అదుపు చే యడానికి పోలీసులు వెనకంజవేశారు. రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు అందడంతో కనీసం పోలీసులు జూదం జరుగుతున్న ప్రాం తాల వైపు కన్నెతి చూడలేదు. కోడిపందేల ముసుగులో వివిధ జూద కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో పందేలను తిలకించడానికి వెళ్ళిన ప్రజాప్రతినిధులు, పెదవి విప్పకపోవడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యువతను వ్యచనాలకు దూరంగా ఉంచడానికి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ వం టి విద్యార్థి సంఘాలు వివి«ధక్రీడా పో టీలు నిర్వహిస్తూ యువతలో ఉత్సాహంతోపాటు, నైతిక స్థైర్యాన్ని మానవతా విలువలను పెంపొందిస్తుంటే మరోవైపు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు జూదాన్ని ప్రోత్సహించడంపట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోడిపందేల ముసుగులో జరుగుతన్న జూదాన్ని అరికట్టడానికి న్యాయస్థానాలు స్పందించాలని మేధావి వర్గాలు సూచిస్తున్నాయి.
కో అంటే కో(టి)డి
 
సాంప్రదాయం ముసుగులో ఆటవికం హద్దులు దాటింది. వినోదం వెర్రితలలు వేసింది. మద్యం ఏరులై పారింది. గుండాట పేకాట జోరుగా సాగింది. ముచ్చటైన సంక్రాంతి మూడు రోజులు వేలాది మంది జేబులు ఖాళీ అయ్యాయి. డెల్టాలో కోడిపందాలు జోష్‌గా సాగాయి. కోడి పందాలుకు మినహా పేకాట గుండాటలకు పోలీసులు అనుమతి లేదు. అయిన యథేచ్ఛగా రాత్రిపగలు అనేది తేడా లేకుండా సాగాయి. భీమవరం చింతలపాటి దొడ్డిలో కోట్లాదిరూపాయలు కోడిపందాలు జరిగాయి. పెద్ద బరికి అనుబంధంగా అదే రోడ్డుల్లో మరో 4 బరుల్లో కోడిపందాలు నిర్వహించారు.
ఆకివీడు మండలం ఐభీమవరంలో భారీ ఎత్తున పందాలు సాగాయి. కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామంలో గోకరాజు కుటుంబం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరగగా తెంగాణాకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు వారి అనుచరగణం, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం విశేషం. భీమవరం మండలం, వెంప,దిరుస్సుమర్రు, ఈలంపూడి,కొమరాడ తదితర గ్రామాల్లో పందాలు నిర్వహించారు. పాలకోడేరు మండలంలో శృంగవృక్షం,పెన్నాడ,మోగల్లు, కొరుకొల్లు,గరగపర్రు తదితర గ్రామాల్లో యథేచ్ఛగా కోడిపందాలు జరిగాయి. భీమవరంలో జరిగిన కోడిపందాల్లో గుండాట వద్ద వివాదం చోటు చేసుకుంది.

ఒక మాజీ కౌన్సిలర్‌ గుండాట ఆడుతున్న వ్యక్తిని బయటకు లాగడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి కూర్చితో కొట్టడంతో తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో రెండు వర్గాలు విడిపోయి కుర్రాళ్ళు అరగంట సేపు ఘర్షణకు దిగారు. పెద్దలు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. మరో వైపు కోడి పందాల బరిల్లో మందుబాబు పూటుగా మద్యం సేవించి పదుల సంఖ్యల్లో పడిపోయే దృశ్యాలు పందాల వద్ద దర్శనమిచ్చాయి. ఏది ఏమైన సంక్రాంతి దినాల్లో పేదలు అప్పులు చేసి మరీ పందాలు బెట్టింగ్‌ కట్టడం చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు.

పందెం.. రూ.125 కోట్లపైనే

సంక్రాంతి పండగ మూడు రోజులు ముచ్చటగా ముగిసింది. ఖరీప్ పంట దెబ్బతిని,అప్పపాలైన అన్నదాత ఊళ్ళకు పొరుగు ప్రాంతాల అతి«థులు భారీగానే తరలి వచ్చారు. కోడి పందేల్లో చిన్నా, పెద్దా అంతా పాల్గొన్నారు. పందేలు కాశారు. రాజకీయ నేతలు సినీరంగ ప్రముఖులు,సాఫ్ట్‌వేర్,పారిశ్రామిక వేత్తలంతా జిల్లాలోనే పండ గా చేసుకున్నారు.ఇలా జిల్లాలోని పల్లె లే కాదు పట్టణాల్లో అన్ని గడపలు కిటకిటలాడాయి. హైదారాబాద్, రం గారెడ్డి జిల్లాలతో పాటు, రాయలసీ మ, తెలంగాణల నుంచి కూడా వెల్లువలా తరలి రావడం విశేషం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనశ్శాంతి కోల్పోయిన సెటిలర్స్‌తో పాటు స్థానికులు కూడా రిలాక్స్ కోసం జిల్లాకు వ చ్చామని చెప్పుకొచ్చారు.

ఈ సారి 30 మందికి పైగా ఎమ్మేల్యేలు రావడం గమనార్హాం సినీనటులు శ్రీకాంత్, ఎంఎస్ నారాయణ,శివకృష్ణ, కృష్ణుడు వంటి వారితో పాటు అగ్రశ్రేణి నిర్మాత దిల్‌రాజు, బెల్లంకొండ సురేష్ వంటి వారు కూడా ఇక్కడికి వచ్చారు. భీమవరం, ఆకివీడు, జువ్వలపాలెం, కలగంపూడి, పాలకొల్లుతో పాటు మెట్ట ఏజన్సీలోని పెదవేగి, జంగారెడ్డి గూ డెం, తీరంపేట వంటి ప్రాంతాల్లో కూ డా లక్షలాది మంది సమక్షంలో కోడి పందేలు జరిగాయి. పోటీలు విలువ తో పాటు జూదాలు, మద్యం లావాదేవీలు రూ.125 కోట్లకు పైగా మారకం జరిపినట్టు ప్రాథమిక అంచనా వే స్తు న్నారు. నేరుగా ఎమ్మేల్యేలు సైతం ప చ్చనోట్లు చేత్తో పట్టుకుని పందేలు కాశారు. గుండాటలు బోర్డులు పేకాటలు, లోపల బయటా కోతాటలు, వంటి జూదాలు విచ్చల వి డిగా సాగా యి. మూడు రోజులు పాటు పోలీసులు ఈ పందేల కేంద్రాలు వైపు కన్నెత్తి చూడలేదు. కోడి పందాల జూదాలు ని ర్వహణకు ఏ మాత్రం అడ్డులేకపోవడంతో ఏటా ఇలా మూడు రోజులు పాటు చట్టాన్ని సవరిస్తేసరి అంటూ ప్రముఖులు మీడియాతో బహిరంగం గా చెప్పుకోవడం కనిపించింది.

మకర సంక్రాంతి, కనుమరోజున జిల్లాలో బంధువుల ఇళ్ళ వద్ద పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చి సాగనంపారు.శనివారం రాత్రి భీమవరం మండలం వెంప శ్రీరామపురంలో సంక్రాంతి సంబరాలు విందు లు చేసుకున్నారు. దీనికి పార్లమెంట్ సభ్యుడు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఈసారి సంక్రాంతి పండగ చేసుకోవడానికి హైదారాబాద్ నుంచి వచ్చి ఆనందంగా తిరిగి వెళుతున్న నాలుగు కుటుంబాలకు చె ందిన ఆరుగు రు భీమవరం సమీపంలో విస్సాకోడేరు లాకు వద్ద కారు కాలవలో పడి అకాల మృతి చెందడం విషాదం మిగిల్చింది.

No comments:

Post a Comment