Friday, January 14, 2011

కోట్ల పందెం * గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ఎమ్మెల్యేల పర్యవేక్షణ.. పోలీసుల పహారా

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల పేరుతో సంకుల సమరం జరుగుతోంది. కాళ్లకు కత్తులు కట్టుకున్న కోడిపుంజులు ప్రాణాలొడ్డి ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఆ కోళ్ల మీద, వాటి మధ్య పోరాటం పైన కోట్ల రూపాయల్లో పందాలు సాగిపోతున్నాయి. ఈ మహా జూదానికి గౌరవనీయులైన శాసనభ్యులే ప్రత్యక్ష పర్యవేక్షణ వహిస్తుంటే.. అరికట్టాల్సిన పోలీసులు ప్రత్యేకంగా పహారా కాస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. తమ వాటా తాము పొందుతున్నారు. దాదాపు ప్రతి గ్రామంలోనూ కోడిపందాలు, పేకాటల కోసం షామియానాలు వెలిశాయి. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఈ దృశ్యాలు షరామామూలే అయినా.. ఈసారి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ‘మరింత క్రియాశీలంగా’ పాల్గొనటం విస్మయం కలిగిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా విచ్చేసి జూదక్రీడలో పాల్గొనటం ఈ ఏటి విశేషం. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచే కాదు.. ప్రవాసాంధ్రులు కూడా ఇందులో ఓ చేయి వేస్తున్నారు. మూడు రోజుల పండగలో తోలి రోజున ఉభయగోదావరి జిల్లాల్లో కలిపి రూ. 65 కోట్లు పందెంలో చేతులు మారినట్లు తెలుస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూలేని విధంగా భోగి రోజైన శుక్రవారం జిల్లాలోని సుమారు 200కు పైగా కేంద్రాల్లో కోడి పందాలు, పేకాటలు యథేచ్ఛగా సాగాయి. తొలి రోజునే సుమారు రూ. 50 కోట్ల మేర సొమ్ము కోడి పందాలు, పేకాటల్లో చేతులు వూరింది. ఈ పందాలను తిలకించేందుకు, పాల్గొనేందుకు ప్రత్యేకంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు తరలిరావటం విశేషం. పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఒక రోజు వుుందుగానే భీమవరానికి అతిథులుగా వచ్చి బస చేశారు. వివిధ ప్రాంతాల్లో కోడి పందాల్లో పాల్గొన్నారు. నరసాపురం శాసనసభ్యుడు వుుదునూరి ప్రసాదరాజు స్వగ్రావుమైన యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో భారీ ఎత్తున సాగిన కోడి పందాల్లో హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్, వుల్కాజ్‌గిరి శాసనసభ్యులు శ్రీశైలంగౌడ్, ఆకుల రాజేంద్ర, సీవు ప్రాంతంలో ధర్మవరం శాసనసభ్యుడు కె.వెంకట రామిరెడ్డితోపాటు కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.

వీరితో పాటు పశ్చివుగోదావరి జిల్లా తణుకు, చింతలపూడి శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వుద్దాల రాజేష్‌కువూర్‌తో పాటు జడ్‌పీ చైర్మన్ మేకా శేషుబాబు కోడి పందాలను తిలకించారు. ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఉండి మండలం యండగండి గ్రామంలో జరిగిన కోడి పందాలకు విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు హాజరయ్యారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున కోడి పందాలు జరిగాయి. భీవువరం వుండలం వెంపలో జరిగిన కోడి పందాల్లో పఠాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్, వుంత్రి జానారెడ్డి కువూరుడు, కోడలు పాల్గొన్నారు. కావువరపుకోటలో జరిగిన పందాల్లో విజయువాడకు చెందిన వూజీ వుంత్రి కువూరుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఉండి మండలం యండగండి గ్రామంలో జరిగిన కోడి పందాల్లో సినీ నటుడు కృష్ణుడు (వినాయకుడు ఫేం) పాల్గొన్నారు. ఆకివీడు ఐ.భీమవరంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కనుమూరు అబ్బాయిరాజు నేతృత్వంలో రాష్టస్థ్రాయి పందాలు జరిగాయి. భీమవరం ప్రకృతి ఆశ్రమం సమీపంలో జరిగిన కోడి పందాలకు సినీ హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితర ప్రముఖులు హాజరై కొద్దిసేపు పందాలను తిలకించారు. ఏజెన్సీ ప్రాంతమైన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నడుమ భారీ కోడి పందాలు జరిగాయి. జిల్లాలో యథేచ్చగా సాగిన జూదాల జాతరలో పాలు పంచుకునేందుకు అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, హైదరాబాద్, వరంగల్, మెదక్, కృష్ణా, తూర్పు, విశాఖ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. కోడి పందాల్లో పాల్గొనేందుకు, చూసేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు జిల్లాకు చేరుకున్నట్లు చెబుతున్నప్పటికీ, శుక్రవారం 11 మంది మాత్రమే పందాల వద్ద కనిపించారు. మిగతావారు శని, ఆదివారాల్లో జరిగే పందాల్లో పాల్గొనవచ్చని భావిస్తున్నారు. వీరు వేర్వేరు ప్రాంతాల్లో లాడ్జిల్లో, మిత్రుల ఇళ్ల వద్ద బస చేశారు. శుక్రవారం చిన్నస్థాయి పందాల్లో రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు సాగితే, భారీ పందాలు రూ. 5 లక్షల నుంచి రూ. 10-15 లక్షలకు పైగా పందాలు జరిగాయి. మొత్తంగా జిల్లాలో తొలి రోజు శుక్రవారం రూ.50 కోట్లు పందాల్లో చేతులు మారినట్లు అంచనా. శని, ఆదివారాల్లో ఈ మొత్తం రూ. 100 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు.

‘తూర్పు’ పందెం రూ. 15 కోట్లు...


సంక్రాంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా జరుగుతున్నాయి. కోట్ల రూపాయల్లో జరుగుతున్న పందాలు శనివారం మరింత ఊపందుకోనున్నాయి. పందాలకు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలే కాక ఉన్నతస్థాయి నేతల ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. మెట్ట ప్రాంతంలోని కిర్లంపూడి మండలంలో పందాలు భారీగా జరుగుతున్నాయి. ఓ మాజీ మంత్రితో పాటు స్థానిక రాజకీయ ప్రముఖులు కూడా పందాలకు తమ వంతు సహకారాలు అందచేస్తున్నారు. పందాల జోలికి రాకుండా పోలీసులకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందినట్లు తెలుస్తోంది. మామిడి కుదురు మండలం అంతర్వేదిపాలెంలో జరిగే పందాల్లో రూ. కోటి పైగా చేతులు మారనున్నట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా ఉన్న నాయకునితో పాటు మాజీ ఎమ్మెల్యే పందాల నిర్వహణకు అండగా నిలిచినట్లు చెప్తున్నారు. కోనసీమలోని అల్లవరం మండలం గోడి, గోడిలంక, గుండుపూడి గ్రామాల పరిసరాల్లో శని, ఆది వారాల్లో రూ. కోటిన్నర మేర పందాలు జరగనున్నాయి. 


కోసా... మజాకా
చనిపోయిన పం దెం కోడి(కోస) మాంసాన్ని ఏడాదికి ఒక సారైనా రుచి చూడాలని మాంసప్రియులు ఉవ్విళ్లూరుతారు. వారి ఆరాటాన్ని చూసి పందెం రాయుళ్లు మాంసానికి వేలం నిర్వహిస్తారంటే దీనికి ఏపాటి డిమాండు ఉందో అర్థం చేసుకోవచ్చు. కోడిపందాల్లో చనిపోయిన కోడి మాంసానికి గిరాకీ ఎక్కువ. జీడిపప్పు, బాదం, పిస్తా, నాటు కోడిగుడ్డు, ఎండుద్రాక్ష వంటి బలమైన ఆహారంతో పెంచడంతో కోసకు మధురమైన రుచి ఉంటుందని చెబుతారు.

దీంతో కోస మాంసం కిలో రూ. 500 నుంచి రూ. రెండు వేల వరకు పలుకుతోంది. ఒక్కొక్కసారి పందాలు జరిగే ప్రదేశాల్లోనే కోసకు వేలంపాట నిర్వహిస్తారు. కాకి, డేగ, రసంగి జాతుల కోస మాంసానికైతే మరింత డిమాండ్. నాటుకోడి మాంసం కన్నా ఈ మాంసం రుచి ఎక్కువంటారు.

 
కోడి పందాలపై డాక్యుమెంటరీ

పల్నాటి పౌరుషానికి ప్రతీకగా పేర్కొనే కోడి పందాలు అనేక సిని మాల్లో తెరకెక్కాయి. సంక్రాంతి సంప్రదాయం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం లో పెద్ద ఎత్తున సాగుతున్న కోడి పందాలపై తాజాగా డాక్యుమెంటరీని రూపొందించే పనిలో హైదరాబాద్ యువకులు బిజీ అయ్యారు. న్యూ యార్క్‌లోని ఎన్నారైలకు చెందిన కంపెనీ సినీ సబ్షన్‌కు చెందిన హైదరాబాద్ యువకులు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన దేవు వర్మ, జగదీష్, ప్రకాష్ అనే యువకులు భీమవరం ప్రకృతి ఆశ్రమంలోని కోడి పందాలను వీడియోలో చిత్రీకించా రు. ‘ద టౌన్ ఆఫ్ సంక్రాంతి’ అనే పేరుతో భీమవరంలో జరిగే కోడి పందాలు, సంక్రాంతి ఉత్సవాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. 

పండగలో వస్తాం.. ఎంజాయ్ చేస్తాం 
‘సంక్రాంతి పండగ సందర్భంగా ఏటా భీమవరం వస్తాం. మూడు రోజులూ ఎంజాయ్ చేస్తాం’ అంటూ తెలంగాణ వాసులు ఆనందడోలికల్లో మునిగితేలారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన తెలుగుదేశం నాయకులు టి.వెంకటేష్, మహేష్‌నాయుడు, మోహన్‌రెడ్డి, రాజరెడ్డి, నాగార్జునరెడ్డి, బహుదూర్ తదితరులు గురువారం భీమవరం వచ్చారు.

పకృతి ఆశ్ర మం సమీపంలోని కోడి పందాల దిబ్బ వద్ద విలేకరులతో ముచ్చటించారు. ప్రస్తుతం తామంతా తెలుగుదేశంలో ఉన్నా త్వరలో వైఎస్ జగన్ వెంట నడుస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలని తాము కోరుకోలేదని చెప్పా రు. త్వరలో తెలంగాణలో జగన్ చేపట్టే ఓదార్పుయాత్రకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతి సంక్రాంతికి భీమవరం ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేస్తామని చెప్పారు.


బిగ్ ఫైట్ సై..
శుక్రవారం ఇక్కడ జరిగిన పందాల్లో రూ. 65 లక్షలు చేతులు మారాయి. పండుగ మూడు రోజులూ పందాలు వేసేందుకు సుమారు రూ. రెండు లక్షలు పోలీసులకు ముట్టినట్లు తెలుస్తోంది. ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, ఐ.పోలవరం శివారుల్లో శనివారం నుంచి పందాలు ఊపందుకోనున్నాయి. రాయవరం మండలం చెల్లూరు, పసలపూడి, సోమేశ్వరం పరిసరాల్లో భారీగా పందెం పుంజులను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఇదే మండలంలో పోలీసులు పేకాట రాయుళ్లపై చేసిన దాడిలో సుమారు రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రూ. 15 కోట్ల మేర పందాలు సాగినట్లు సమాచారం. 

జిల్లాలో సంక్రాంతి సంప్రదాయం ముసుగులో కోడి పందాలు ఉవ్వెత్తున సాగాయి. రాజకీయుం పైచేరయి సాధించడం.. ఈనెల మొదటివారంలోనే పోలీసులు ‘బరి’లోకి దిగకూడదని నిర్ణయించుకోవడంతో పందాలరాయుళ్లకు అడ్డులేకపోయింది. తొలి రోజు శుక్రవారం జిల్లాలో రూ. 50 కోట్ల మేర జరిగిన ఈ పందాలు రికార్డులను తిరగరాశారు. చిన్నస్థాయి పందాలు రూ. 5 వేల నుంచి 50 వేల వరకు సాగితే, భారీ పందాలు రూ. 5 లక్షలు పైబడి జరిగాయి. ఒక్కో పందానికి రూ. 10-15 లక్షలకు పైగా పైపందాలు జరిగాయి. సందట్లో సడేమియూగా సాగిన కోతాట, గుండాట జనం జేబులు గుల్ల చేశాయి. పందాల బరిల వుధ్య మద్యం ఏరులై పారింది. పదివుందికి పైగా శాసనసభ్యులు, సినీ ప్రముఖులు ఈ జూద క్రీడల్లో పాల్గొని ‘వన్నె’ తెచ్చారు.

 జిల్లా అంతటా శుక్రవారం జూదా ల జాతర యథేచ్ఛగా సాగింది. పందెం కోళ్లు హోరాహోరీగా కత్తులు దూశాయి. రెండు వారాల ముందుగానే ‘కాసుల సంకెళ్లు’ పడిన పోలీసులు శుక్రవారం ఉదయం వరకు పందాల బరిల వద్ద నావువూత్రపు కాపలా కాసి 11 గంటల సమయంలో పచ్చజెండా ఊపారు. పం దాలకు ఊతమిస్తూ ఆ పక్కనే కోసాట, గుండాట పెద్ద ఎత్తున నిర్వహించారు. మద్యం బెల్ట్ షాపులు, పలావులు, కోడి పకోడీలు, సిగరెట్లు, కిళ్లీలు, ఇతర తినుబండారాల స్టాల్స్ కూడా వెలిశాయి. అక్కడ ధరలు జూదప్రియుల జేబులకు చిల్లులు చేశారు. ఈ షాపుల వారి నుం చి కూడా నిర్వాహకులు ప్రత్యేకంగా స్థ లం అద్దె పేరుతో వసూళ్లు సాగించారు.

టర్నోవర్ రూ. 50 కోట్లు
తొలి రోజునే జిల్లాలో సుమారు రూ. 50 కోట్ల మేర చేతులు మారినట్లు అంచనా. తొలిరోజు పందాలు విజయువంతం కావడంతో నేటి నుంచి లక్షలాది రూపాయలు గుత్త (కేవుల్) రూపంలో నిర్వాహకులు వసూలు చేస్తునట్లు సమాచా రం. అమెరికాలో ఉంటున్న ప్రవాసాం ధ్రులు, పశ్చిమ గోదావరి జిల్లాతో అనుబంధం కలిగిన కర్నాటక, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన ప్రముఖులతోపాటు కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల నుంచి పందాలరాయుళ్లు ప్రత్యేక వాహనాలపై పుంజులతో సహా వచ్చారు. జిల్లాలో పలుచోట్ల జరిగిన కోడి పందాల్లో పాల్గొని తమ సరదా తీర్చుకున్నారు.

200కు పైగా కేంద్రాలు

ఆకివీడు మండలం అయి భీమవరం, యలమంచిలి మండలం కలగంపూడి, భీమవరం ప్రకృతి ఆశ్రమం ప్రాంతం, పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో భారీ పందాలు సాగాయి. ఏజెన్సీ ప్రాం తమైన జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ‘పశ్చిమ గోదావరి వర్సెస్ ఖమ్మం’ పేరుతో కోడి పందాలు పెద్దఎత్తున నిర్వహించారు. కాళ్ళ మండ లం కాళ్ళకూరు, ఉండి మండలం యం డగండి, ఉండి, పెదపుల్లేరు, పాలకోడేరు, వీరవాసరం మండలం వీరవాసరం, కొణితివాడ, రాయకుదురు, ఉత్తరపాలెం, పెరవలి మండలం ఖండవల్లి, ముక్కామల, తణుకు మండలం తేతలి, వేల్పూరు, అత్తిలి, ఇరగవరం మండలం విప్పర్రు, ఉండ్రాజవరం మండలం స త్యవాడ, తాడేపల్లిగూడెం రన్‌వే వద్ద, అ ప్పారావు తోపు, ఉంగుటూరు మండలం కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు, మొగల్తూరు మండలం రామన్నపాలెం, పేరుపాలెం, శ్రీరామపురం, భీమవరం మం డలం వెంప గ్రామాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు సాగాయి. ఊరూరా (చిన్నస్థాయి) పందాలు జరిగాయి.

కోడి పందాల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు
సంక్రాంతి మూడు రోజులు రోటీన్‌కు భిన్నంగా గడపాలనుకున్నారో ఏమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేస్తున్న ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కోడి పందాలకు వచ్చారు. జిల్లాలోని మిత్రుల ఆహ్వానాన్ని అందుకుని ఎంజాయ్‌మెంట్ కోసం ముందుగానే వచ్చి బస చేశారు. తెలంగాణ, రాయలసీమలకు చెందిన ఎమ్మెల్యేలు భీమవరంలో మకాం వేసినట్లు సమాచా రం. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన దాదాపు 25వుంది మంది ఎమ్మెల్యేలు జిల్లాకు వచ్చినట్లు తెలుపుతున్నప్పటికి వారిలో 11 మంది మాత్రమే కోడి పందాలకు హాజరయ్యూరు. మిగిలిన వారు శని, ఆదివారాల్లో జరిగే పందాలలో పాల్గొంటారని తెలుస్తోంది.

కలగంపూడిలో జరిగిన భారీస్థా యి కోడి పందాల్లో తెలంగాణ ప్రాం తానికి చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేంద్ర, ఖుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే శ్రీశైలం గౌడ్, రాయలసీమకు చెంది న ధర్మవరం ఎమ్మెల్యే అనంత రామిరెడ్డి, కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే జ యమంగళ వెంకటరమణ, మన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ మేకా శేషుబాబు పాల్గొన్నారు.

భీవువరం వుండలం వెంపలో పఠాన్‌చెర్వు ఎమ్మెల్యే వుహేశ్వర్‌గౌడ్ పాల్గొనగా, ఉండి మండలం యండగండిలో జరిగిన కోడి పందాల్లో విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్న బాబురాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు పాల్గొన్నారు.

పెదవేగి మండలం కొప్పాకలో తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాక ర్, బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బా లరాజు కోడి పందాల్లో పాల్గొన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి జిల్లాకు చేరుకున్నా పందాలలో పాల్గొనలేదు.

భీమవరం ప్రకృతి ఆశ్రమంలో జరిగి న కోడి పందాల్లో సినీ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, చింతలపాటి నరసింహరాజు, నందమూరి తాతాజీ, గన్నాబత్తుల శ్రీనివాస్, డీఎస్ రాజు పాల్గొన్నారు.

ఆకివీడు మండలం అయిభీమవరం లో జిల్లా కాంగ్రెస్ నాయకుడు కనుమూ రు అబ్బాయిరాజు నేతృత్వంలో రాష్టస్థ్రాయి కోడి పందాలు సాగాయి. యండగండి గ్రామంలో సినీ నటుడు కృష్ణుడు (వినాయకుడు ఫేం) వచ్చి పందాలను తిలకించారు. విజయువాడకు చెందిన వూ జీ వుంత్రి కువూరుడు దేవినేని అవినాష్ కావువరపుకోటలో జరిగిన పందాల్లో పాల్గొనగా, వుంత్రి జానారెడ్డి కువూరుడు, కోడలు వెంపలో పాల్గొన్నారు.

అరగంట మోగించి.. ఆరు నిమిషాల్లో ముగించి
జిల్లాలో పలుచోట్ల జరిగిన భారీ పందాల్లో నిముషాల్లోనే లక్షలాది రూపాయలు చేతులు మారాయి. తాము సిద్ధం చేసుకున్న పుంజులను ఎదురెదురుగా పెట్టుకుని ఒక్కో పందాన్ని మోగించేం దుకు అరగంట సమయం పట్టింది. పందెం మొదలైన ఆరు నిమిషాల్లోపే తాడోపేడో తేలిపోయింది. చిన్న స్థాయి పందాల్లో రూ. 5 వేల నుంచి రూ. 50 వేల వరకు సాగితే, భారీ పందాలు రూ.5 లక్షల పైబడి జరిగాయి. ఒక్కో పందానికి రూ. 10-15 లక్షలకు పైగా పై పందాలు జరి గాయి. ఈ సారి పలు పందాలను వీక్షిం చేందుకు మహిళలు తరలిరావడం విశే షం. తొలిరోజు పందాల్లో నెమలి రకం కోడి పుంజుదే పైచేయిగా సాగడం గమనార్హం.



ఎక్కడి పోలీసులు అక్కడే గప్‌చుప్

‘కోడి పందాలు జరగనివ్వం.. ఎక్కడ కోడి పందాలు జరిగితే ఆ ప్రాంతంలోని పోలీసులపై చర్య తప్పదు’.. ఇవి గత ఏడాది డిసెంబర్ 14న జిల్లాకు వచ్చిన ఐజీ వినయ్‌కుమార్ చేసిన హెచ్చరికలు. జిల్లా పోలీసులు మాత్రం ఆయన హెచ్చరికలను అంతగా పట్టించుకున్నట్లు లేదు. తొలి నుంచి కోడి పందాలపై పట్టు వదిలేయడంతో ఈసారి నేతలు ఎటువంటి పంతాలు, పట్టింపులకు పోకుండానే సజావుగా సాగింది. అయినా ఎందుకో మరి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోడి పందాల బరిలో పోలీసులు పహారా కాశారు. అటు తర్వాత ఏమైందో ఏమో వారంతా జారుకున్నారు.

ఎక్కడి పోలీసులు అక్కడే గప్‌చుప్ కావడంతో ఏటా మాదిరిగానే పెద్ద ఎత్తున కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి. పలు మండలాల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున వసూళ్లకు వినియోగించడం మరో విశేషం. ప్రత్యేకంగా కేటాయించిన ఇద్దరు కానిస్టేబుళ్లు మఫ్టీలో పేకాట, కోడి పందాలు జరిగే ప్రాంతాలకు పంపడం గమనార్హం.


ఎలాగూ పందాలు జరుగుతున్నందున ఆయా ప్రాంతాల్లోని నిర్వాహకుల నుంచి పలుచోట్ల మామూళ్లు దండుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాళ్ళ మండలం కాళ్ళకూరులో ఇలా వసూళ్లకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు  కెమేరాకు చిక్కారు. చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ‘బరి’ తెగించి కోడి పందాలకు తెగపడటంతో చేసేది లేక పోలీసులు ఈ మూడురోజులైనా విశ్రాంతి తీసుకుందామని నిశ్చయానికి వచ్చేశారు. 



పందెం కోడిదే పైచేయ 

కత్తి కట్టిన పందెం కోడి ముందు లాఠీ చిత్తయింది. పందాలు జరిపితే ఊరుకోబోమని ఆదిలో హూంకరించిన పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. అమాత్యులు మొదలు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వరకు వివిధ స్థాయిల్లో ఒత్తిళ్లు ఎక్కువయ్యూరు. దీంతో జిల్లాలో కోడిపందాల సంబరాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పండుగ మొదటి రోజైన భోగినాడు కోడిపందాలు పెద్ద మొత్తాల్లోజోరుగా జరిగారుు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమల్లో భారీగా పందాలు వేసేందుకు పందాలరాయుళ్లు సంసిద్ధులవుతున్నారు.

‘మేం మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్ద’నే ఒప్పందం నేతలు, పోలీసుల మధ్య కుదిరిందని తెలుస్తోంది. కోనసీమలో ప్రజాప్రతినిధుల ఒత్తిడి కి పోలీసులు కాదనలేకపోయారు. ఫలితంగా గత సీజన్లో మాది రిగానే కీలక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అల్లవరం మండలం గోడి, గోడిలంక, గుండుపూడి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రూ. 75 లక్షల మేర పందాలు జరిగాయని అంచనా వేస్తున్నారు. సం క్రాంతి, కనుమ, ముక్కనుమలకు ఇంతకు రెట్టిం పు స్థాయిలో రూ. కోటిన్నర మేర పందాలు వేసేం దుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియవచ్చింది. ఆ మూడు రోజుల పందాల కోసం పోలీసులకు సుమారు రూ. రెండు లక్షల మేర చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని సమాచారం.


ఆదివారం జరిగే పందాలకు తాను కూడా వస్తానని రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు కబురు పంపారనే ప్రచారం ఉంది. గత సీజన్‌లో ఈ మండలంలో జరిగిన పందాల వెనుక ఇద్దరు కీలక ప్రజాప్రతిని ధులు క్రియాశీలక పాత్ర పోషించారు. పందాలకు ఐ.పోలవరం మండలంలోని పలు గ్రామాలు కీలక స్థావరాలుగా నిలిచాయి. ప్రధానంగా కేశనకుర్రుపాలెం, ఐ.పోలవరంలోని పెదమడి మొక్కతోట ల్లో జోరుగా పందాలు జరిగాయి. టీడీపీకి చెందిన ఒక ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎంపీపీ దగ్గరుండి పందాలు నిర్వహించారంటున్నారు.


ఇక్కడ పందాలు జరగవనే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన పందాలరాయుళ్లను రెండు రోజుల్లో జరిగే పందాలకు తరలిరావాలని నిర్వాహకులు వర్తమానం అందించారని స మాచారం. ఈ పందాల కోసం పోలీసులతో నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారని తెలియవచ్చింది. మామిడికుదురు మండలం గోగన్నమఠం, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో రూ. కోటి పైగానే పందాల్లో చేతులు మారాయంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో పాటు పలు పార్టీల నేతల ఒత్తిళ్ల వల్ల పోలీసులు నిమ్మకునీరెత్తినట్టుగా ఉన్నారని స్థానికులు పేర్కొంటున్నారు. కోనసీమతో పోటాపోటీగా మెట్ట ప్రాంతంలో కూడా కోడిపందాలు మెుదలయ్యూరు. కిర్లం పూడి మండలంలోని దొరగారి తోటలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో భారీగా పందాలు నిర్వహించేందుకు శుక్రవారం నుంచే ఏర్పాట్లు చేశారు.


శనివారం సుమారు రూ. 50 నుంచి రూ. 75 లక్షల మేర పందాలు జరుగుతాయనే అంచనాలతో నిర్వాహకులు ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఇందుకు రూ.లక్షకు పైగా మామూళ్ల రూపంలో పోలీసులకు ముట్టజెప్పుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే తుని రూరల్ మండలం కె.ఓ. మల్లవరంలో సుమారు రూ. 50 లక్షల మేర పందాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేశారు. తునికి సరిహద్దులో ఉన్న విశాఖ జిల్లా జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు ఇందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. జగ్గంపేట మండలం నరేంద్రపురం, గోవిందపురం గ్రామాల్లో రూ. కోటికి పైగానే పందాల కోసం సిద్ధం చేశారని సమాచారం.


పోలీసులను చూసీచూడనట్టుగా ఉండమని ఒక ప్రజాప్రతినిధి ఆదేశాలు జారీచేశారంటున్నారు. కపిలేశ్వరపురం ఏటిగట్టు, లంక గ్రామాలు, ద్వారపూడి పందిరి చెరువుతోట, రాయవరం మండలం చెల్లూరు, పసలపూడి, సోమేశ్వరం పరిసరాల్లో భారీగా పందెగాళ్లు పుంజులను సిద్ధం చేస్తున్నారు. స్థానిక ప్రతినిధులు స్టేషన్‌కు రూ. 50 వేల వంతున చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పేకాట రాయుళ్లపై గతేడాది ఇదే మండలంలో జరిపిన దాడిలో సుమారు రూ. కోటి మెుత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కారు సహా ఆయన అనుచరులు పోలీసులకు చిక్కారు. కడియం మండలం వీరవరం శివార్లలో భారీగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు.


సుమారు రూ. 10 లక్షలు ఇక్కడ చేతులు మారాయని చెబుతున్నారు . స్థానిక సంస్థల ప్రతినిధులు ఆ మేరకు పోలీసులను ఒప్పించారని సమాచారం. మూడు రోజుల పందాల కోసం రూ.50 వేలు పోలీసులకు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీ పరిధిలోని గంగవరం మండలం ఓజుబంద, దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామాల్లో మైదాన ప్రాంత వాసులు లాబీయింగ్ చేసి పందాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం స్థానిక పోలీసులకు రూ. 50 వేలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఈ రకంగా మూడు కోళ్లు, ఆరు పందాలు అన్నట్టుగా జిల్లాలో కోడిపందాలు జోరుగా జరుగుతున్నాయి.


అనధికారిక అనుమతులు వచ్చేశాయ్‌...!
సంక్రాంతి కోడి పందాల జాతరకు రంగం సిద్ధమైంది. నేటి బోగి పండుగ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఈ కోడి పందాల రాక్షస క్రీడ నిర్భయంగా, యథేచ్ఛగా పెద్దఎత్తున ఉత్సవం మాదిరి కొనసాగనున్నాయి. కోడి పందాలకు పల్నాటి చరిత్ర ఉంది. పందాల్లో కేవలం నగదే కాకుండా భూములను, స్ధిర చరాస్తులను కూడా పణంగా పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. జోరుగా సాగే ఒప్పందం పందాల్లో క్షణాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారటం షరా మామూలే. చూస్తున్నంతలోనే ఆస్తులు కరగటం, పెరగటం జరిగిపోతుంది.

సగటు కోడి పందెం రాయుళ్ళు కూడా సంక్రాంతి పేరుతో జూదశాలలకు వెళ్ళి పండగ సరదాను దండగతో ముగించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందాలను నిలుపుదల చేయాలంటూ ప్రతిసారీ మహిళా సంఘాలు, అభ్యుదయ సంఘాలు పోలీస్‌ అధికారులను డిమాండ్‌ చేస్తూ రావటం పరిపాటిగా మారింది. అయినప్పటికీ ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ సంక్రాంతి కోడి పందాలకు తలాడించటం అంతే ఆనవాయితీగా మారిపోయిందనే విమర్శలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు కోడి పందాలకు జిల్లాలోని డెల్టా ప్రాంతమే పేరొందేదిగా ఉండేది. కానీ రానురానూ ఇటీవల కాలంలో చూస్తే ఏజెన్సీ, మెట్ట ప్రాంతం కూడా కోడిపందాలకు డెల్టాతో ఢీకొనటం జరుగుతోంది. గత ఏడాది అప్పటి డిఐజి మహేష్‌ ఎం.భగవత్‌ మాత్రం ఆఖరి గడియ వరకు ఈ కోడిపందాలకు అడ్డుకట్ట వేస్తూ సమర్ధవంతమైన పోలీసు చర్యలు చేపట్టారు.

ఇదికాస్తా జిల్లాలో పరోక్షంగా పొలిటికల్‌ వర్సస్‌ పోలీస్‌ మధ్యన కోల్డ్‌వార్‌కు దారితీసింది. ఎట్టకేలకు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యతో జిల్లాకు చెందిన ఓ మంత్రి వర్యులు నేరుగా అప్పటి డిఐజితో కోడిపందాలకు అనధికార అనుమతులు ఇప్పించాలంటూ సిఫార్సులు కూడా చేయించారు. దీంతో బోగి పండుగ రోజున మధ్యాహ్నం నుంచి మాత్రమే స్థానికంగా ఉండే పోలీసులకు పందాల గ్రీన్‌ సిగ్నల్‌ రావటం జరిగింది. ఐతే సంక్రాంతి మూడు రోజుల పందాల అనంతరం పోలీసు దాడులు అడపా దడపా జరగటం జరిగింది. కానీ గతానికి భిన్నంగా ఈసారి మాత్రం సంక్రాంతి కోడిపందాలకు సంప్రదాయం ముసుగులో ముందస్తుగానే అనధికార పోలీస్‌ బాసుల అనుమతులు వచ్చాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గ్రామ గ్రామానా సంక్రాంతి కోడి పందాలు జరుగుతున్నాయి.

ఐతే జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, కామవరపుకోట మండలంలోని వెంకటాపురం పందాలు ఈసారి భారీగా సాగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ కోడిపందాలను నిర్వహించేందుకు అవసరమైన బిరులు సిద్ధమయ్యాయి. సిమెంట్‌ పోల్స్‌తో పక్కా ఐరన్‌ ఫెన్సింగ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయి. గత రెండేళ్ళుగా శ్రీనివాసపురంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ కోడి పందాలకు రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభోత్సవం చేయటం ఒకింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది కూడా పందెంరాయుళ్ళు ఇప్పటికే బాలరాజుకు రిబ్బన్‌ కట్‌చేసే బంపర్‌ ఆఫర్‌ను ఇచ్చినట్లు సమాచారం. కానీ ఎందుచేతనో ఈసారి మాత్రం బాలరాజు కోడి పందాల ప్రారంభానికి దూరంగా ఉండాలని భావించినట్లు సమాచారం.

ఐతే బాలరాజు రాకున్నట్లైతే ఆఖరి నిముషంలోనైనా సరే ఓ ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ ఉద్దండునితో పందాల బిరిని ప్రారంభించాలనే పట్టుదలతో నిర్వాహకులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదంతా కేవలం పోలీస్‌ దాడుల బెడద నుంచి తప్పించుకునేందుకు, పందాల రాయుళ్ళలో ధైర్యం నింపేందుకే అని అంతా భావిస్తారు. జిల్లాలోని డెల్టా, ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో జరిగే కోడి పందాలకు రాష్ట్ర స్థాయిలో పేరున్న రాజకీయ అమాత్యుల, నేతల కుటుంబాలకు చెందిన సంపన్నులు ఆసక్తితో తిలకించేందుకు వస్తుండటం సంప్రదాయంగా మారింది. రాజకీయంగా అన్ని పార్టీలకు చెందిన నేతలు కోడి పందాల నిర్వహణపై పెదవి విప్పక పోవటం విశేషం.

పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళ మాదిరిగా ఈ సంక్రాంతి కొడి పందాలకు కూడా ముహూర్తాలు పెట్టడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మూడు రోజుల ఈ జాతరలో వందల కోట్ల రూపాయలు జిల్లావ్యాప్తంగా చేతులు మారనున్నాయి. జూదశాలలకు ఒక్కసారిగా రెక్కలు విచ్చుకోనున్నాయి. పేకాట శిబిరాలు రేయింబవళ్ళు నిరంతరాయంగా సాగిపోతాయి. పోలీసు బాసుల కరుణాకటాక్షాల కోసం పందాల, జూదశాలల నిర్వాహకులు ముందస్తుగానే పలుకుబడిగల సంబంధించిన రాజకీయ నేతల సిఫార్సులతో ప్రదక్షిణలు పూర్తిచేసినట్లు సమాచారం. ఇప్పటికే పేరెన్నికగన్న కోడి పందాల శిబిరాల సమాచారం పోలీస్‌ల వద్ద ఉంది. ఎలాగూ రాష్ట్ర స్థాయి నుంచి చూసీ చూడనట్లు పొమ్మంటూ తమకు అందిన అనధికారిక సూచనలను కూడా కొందరు ఖాకీలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పేరుకే గ్రామ గ్రామానా కోడిపందాల నిరోధానికి ప్రత్యేక పోలీస్‌ పికెట్లు పెడుతున్నట్లు పత్రికా ప్రకటనలు వెలువడుతున్నాయి.

జిల్లాకు చెందిన ఓ పార్లమెంట్‌ సభ్యులు నేరుగా ఈ సంక్రాంతి సరదా సంప్రదాయ కోడి పందాలకు ముందస్తుగానే ఈసారి ఈ అనధికారిక అనుమతులను నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తోనే మంజూరు చేయించినట్లు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోడి పందాల కారణంగా పెద్ద సంఖ్యలో వచ్చే జనానికి మద్యం కిక్కు కూడా బలే గమ్మత్తుగా ఎక్కించేందుకు లిక్కర్‌ సిండికేట్లు కూడా తమవంతు పాత్రను పోషిస్తుంటాయి. అసలే ఈసారి భారీ ఎత్తున టెండర్లను కోడ్‌ చేసి షాపులను దక్కించుకుని లబోదిబో మంటున్న వీరు కోడి పందాల శిబిరాల వద్ద ప్రత్యేక అనధికారిక బెల్ట్‌ షాపులను పెట్టుకునేందుకు ఎకై్సజ్‌, పోలీస్‌ అధికారుల నుంచి అనధికారిక అనుమతులు అందుకున్నట్లు తెలుస్తోంది. వర్జీనియా రైతాంగం అకాల భారీ వర్షాలతో అప్పుల ఊభిలో కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో నేటి సంక్రాంతి కోడి పందాలు ఏ మేరకు విజయవంతం అవుతాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

కోడి పందాల శిబిరాలపై దాడులు నిర్వహిస్తాం : జంగారెడ్డిగూడెం డిఎస్‌పి
సంక్రాంతి కోడి పందాల శిబిరాలపై పోలీస్‌ దాడులు కొనసాగుతాయని జంగారెడ్డిగూడెం డిఎస్‌పి రామకృష్ణంరాజు మేజర్‌న్యూస్‌కు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి అనధికారిక అనుమతులు పైనుంచి అందలేదన్నారు. ప్రతి గ్రామంలోనూ ఓ కానిస్టేబుల్‌ను ఇందుకోసం ప్రత్యేక నిఘాగా పెడుతున్నామన్నారు. ముందస్తు సమాచారం ఉన్న శిబిరాల వద్ద పందాల నిరోదానికి ప్రత్యేక పోలీస్‌ పికెట్లను ఏర్పాట చేస్తున్నట్లు కూడా డిఎస్‌పి రాజు స్పష్టం చేయటం విశేషం.
పందేల జోరు ..... ఆంక్షలు బేఖాతరు 
జిల్లాలో ఆగని కోడి పందేలు
రహస్య ప్రదేశాల్లో బరులు
కట్టడికి పోలీసుల యత్నం
ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి
రూ.కోట్లు చేతులు మారుతున్నాయి


సంక్రాంతి వేళ పల్లెలు కోడిపందేలు, పేకాటకు అడ్డాగా మారడం ఆనవాయితీ. దీని వల్ల అనేక కుటుంబాలు బజారున పడిన ఘటనలున్నాయి. ఈ జూదక్రీడను అరికట్టేం దుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. రహస్యప్రదేశాల్లో యథేచ్ఛగా పందేలు కొనసాగిస్తున్నారు. కొందరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న పందేలకు తరలివెళుతున్నారు.

  సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోడి పందేలు, పేకాట యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందుకు పందెపురాయుళ్లు రహస్య ప్రదేశాలను ఎంపికచేసుకుంటున్నారు. పందేలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత పకడ్బందీ ఏర్పాట్లు, కఠిన చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితం కనిపించడంలేదు. లెక్కకుమిక్కిలిగా బైండోవర్ కేసులు నమోదుచేశారు.

కోళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. పందేలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలో ప్రత్యేక బలగాలను దించారు. ఇదంతా పందెగాళ్ల ఉత్సాహం, వ్యూహం ముందు ఎందుకూ కొరగాకుండా పోయింది. మారుమూల గ్రామాల్లో, మామిడి తోటల్లో పందేలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. పందెపురాయుళ్లు కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయించి అనుమతులు పొందుతున్నారు. ఉన్నతాధికారులు ఎంత ఒత్తిడి తెస్తున్నా, నిరుడు చోటుచేసుకున్న కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత ఏడాది పందేలపై పోలీసు దాడి జరిపినప్పుడు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

జిల్లాలో గతంలో మాదిరిగా భారీస్థాయిలో మాత్రం పందేలు జరగడంలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పందెపురాయుళ్లు తరలివచ్చి సంక్రాంతి పండగ మూడు రోజులు ఇక్కడే తిష్ట వేసేవారు. రూ. కోట్లలో చేతులు మారేవి. ఈసారి ఆ పరిస్థితిలేదు. నిరుడు కూడా జిల్లాలో కోడి పందేలను పెద్ద ఎత్తున జరగకుండా పోలీసులు నిరోధించగలిగారు. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ కోడి పందేలకు రాష్టస్థ్రాయిలో పేరొందింది. కానీ, నిరుటి నుంచి ఇక్కడ పందేలు ఆగిపోయాయి. గుడివాడ సమీపంలోని దోసపాడు, రుద్రపాకలలో ఏదో ఒకచోట అనుమతి తెచ్చుకోవడానికి స్థానిక పందెగాళ్లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే రుద్రపాకలో ఇప్పటికే కోడి పందేలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో రెండురోజుల నుంచి పందేలు భారీగా జరుగుతున్నాయి. ఉయ్యూరు మండలం బోళ్లపాడు సమీపంలో పేకాట జోరుగా సాగుతోంది. పమిడిముక్కల మండలం లంకపల్లి సమీపంలోని కృష్ణా కరకట్ట వెంబడి కూడా కోడి పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పెడన నియోజకవర్గంలోని చెరుకుమిల్లి, పెందుర్రు, ఆర్తమూరు తదితర ప్రాంతాల్లోనూ భారీ పందేలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధికి, పోలీసులకు శుక్రవారం వాగ్వివాదం జరిగినట్లు తెలిసింది.

చివరికి ఉన్నతాధికారులు రంగంలోకి దిగి రాజీ కుదర్చడంతో కొన్నిచోట్ల పందేలకు స్థానిక పోలీసులు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. విజయవాడ రూరల్ మండలం, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లోని మామిడి తోటల్లోనూ కొన్నిచోట్ల పందేలు కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు గాలింపు ఎక్కువగా ఉండడం, అనుమానిత ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటుచేయడంతో పందెగాళ్లు అత్యంత రహస్య ప్రాంతాల్లో బరిలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

‘పశ్చిమ’కు పరుగులు
జిల్లాలో పందేలపై పోలీసు ఆంక్షలు ఉండడం, పొరుగున పశ్చిమగోదావరిలోని పలు ప్రాంతాల్లో భారీస్థాయిలో పందేలు, పేకాట జోరుగా సాగుతుండడంతో జూదగాళ్లు అటుగా పరుగులు తీస్తున్నారు. జిల్లా నుంచి వేలమంది పశ్చిమగోదావరి జిల్లాకు వెళుతున్నట్లు పోలీసులే చెబుతున్నారు. హనుమాన్‌జంక్షన్‌కు ఆనుకుని ఉన్న పెదపాడు మండలం అప్పనవీడులో రాష్టస్థ్రాయి పందేలు జోరుగా సాగుతుండడంతో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ, ఐభీమవరం, ధర్మాజీగూడెం, చింతలపూడి ప్రాంతాల్లో పందేలు సాగుతున్నాయి. ధర్మాజీగూడెంలో జరిగిన పందేలకు శుక్రవారం చాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, ముసునూరు మండలాలనుంచి పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఐభీమవరానికి రైళ్లు, బస్సుల్లో కూడా కోడి పుంజులతో పందెపురాయుళ్లు తరలివెళుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో మాదిరిగా ప్రస్తుతం కార్లు పెద్దఎత్తున బుక్ అయిపోయాయి. కనుమ పండగ అయ్యే వరకూ కోడి పందేలు, పేకాట జరుగుతాయని తెలుస్తోంది. జూదగాళ్లు ఉదయం ఇళ్ల నుంచి అదృశ్యమై అర్ధరాత్రి వేళ తిరిగి వస్తున్నారు. పందేలు ఎక్కడ జరుగుతున్నాయనే విషయాన్ని మాత్రం వీరు చాలా రహస్యంగా ఉంచుతున్నారు. కొన్నిచోట్ల పందేలు జరుగుతున్నట్లు తెలిసినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. జిల్లాలో పలుచోట్ల పందేలు జరుగుతున్నా ఉన్నతాధికారుల సూచనల మేరకే పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. భోగి, పండగ, కనుమ రోజుల్లో రూ.30 కోట్లకుపైనే పందేలు జరిగే పరిస్థితి ఉందంటున్నారు. 

జిల్లాలో కోడి పందాలకు సై?
జిల్లాలో కోడి పందాలపెై కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎట్టి పరిస్థితిలోను పందాలు జరిపితీరుతామని ప్రజాప్రతినిధులు పట్టు పట్టి అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాత్రిపగలు పందాలు నిర్వహణకు రంగం సిద్ధం చేశారు. ఫ్లడ్‌లెైట్‌ల వెలుగులులో పందేం రాయుళ్ళ కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది ఇదే తరహాలో పోలీసులు కోడిపందాలపెై ఖరాఖండిగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అమలాపురం ఎం.పి జి.వి హర్షకుమార్‌ తన కుటుంబ సభ్యులతో అల్లవరం మండలం గోడి గ్రామంలో దగ్గరవుండి కోడిపందాలను ఆడించారు. ఈ ఏడాది అదే తరహలో ఎమ్మెల్యె లు దగ్గర వుండి పందాలు ఆడించాలని పట్టుదలతో ఉన్నారు.


కార్యకర్తలు ఒత్తిడి మేరకు ప్రజాప్రతినిధులు సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించాలని రాష్టస్థ్రాయిలో చేసిన పెైరవీలు ఫలించాయి తెలుస్తోంది. అందుకునే చాలా ఏళ్ళ తరువాత కోడి పందాలు నిర్వహణకు అనధికారిక ఆదేశాలు రానున్నాయి అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నందున జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కోడిపందాలకు సంబంధించి రాష్టస్థ్రాయి నేతల పెై ఒత్తిడి తీసుకు వచ్చిన వెంటనే అనుమతి లభించినట్లు తెలుస్తుంది. పక్కజిల్లాలో ఉన్న ఆనందం తమ జిల్లాలో ఎందుకు లేదంటూ ఇక్కడ ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు ఒంటికాలుపెై లేస్తున్నప్పటికీ ఫలితం కనపడేది కాదు. ఇక్కడ పోలీసు యంత్రాగం కోడిపందాలపెై కఠినంగా వ్యవహరించడంతో మారుమాల ప్రాంతాలలో చాటుమాటుగా చిన్నచిన్న పందాలు నిర్వహించడం తప్ప బహిరంగంగా పందాలు నిర్వహించే పరిస్థితి ఉండేడి కాదు. ఈ ఏడాది అటువంటి సమస్య తలెత్తకుండా బోగి పండగ నుంచి కనుమ పండగ వరుకు కోడిపందాలపెై ఎలాంటి దాడులు నిర్వహించకూడదని రాష్ట్ర హోంశాఖ నుంచి జిల్లా పోలీసు యంత్రాగానికి అనధికారిక ఆదేశాలు రానున్నట్లు తెలిసింది.


దీంతో ఎన్నో ఏళ్ళ నుండి కోడిపందాల సరదా కోసం ఆరాటపడుతున్న వారందరికీ ఎక్కడిలేని ఉత్సాహం వచ్చి పడుతుంది. అప్పుడే పందేం రాయుళ్ళు పందాలకు వేదికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా అంతట ఈ కోడిపందాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తూండగా కోనసీమలో అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం మండలాలలో కోడిపందాలకు బహిరంగ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య కోడిపందాల వార్‌ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.


కోడి కాలుదువ్వింది.....
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పోలీసు అధికారుల హెచ్చరికలను లెక్కచేయక కోడిపందాలు మొదలయ్యాయి. ఎప్పటిలాగే ఈసారికూడా కోడిపందాలు, గుండాటలు, పేకాటరాయళ్లపెై కఠినచర్యలు తీసుకుంటామని, ఉక్కుపాదంతో అణచివేస్తామని చేస్తున్న పోలీసు ప్రకటనలు పత్రికలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ మండలంలోను కోడిపందాలు నిర్వహించడానికి పోలీసు అధికారులపెై పెద్ద ఎత్తున రాజకీయ పెైరవీలు మొదలయ్యాయి. అటు జిల్లా ఎస్పీ ఆదేశాలు, ఇటు రాజకీయ ఒత్తిళ్ల మధ్య పోలీసుసిబ్బంది నలిగిపోతున్నట్లు కోనసీమకు చెందిన పోలీసు అధికారి ఒకరు మేజర్‌న్యూస్‌ వద్ద వాపోయారు. ముఖ్యంగా అల్లవరం మండలం గోడి, గోడిలంక గ్రామాలలో పేకాటలు, గుండాటలు, కోడిపందాలు నిర్వహించడానికి కోనసీమకు చెందిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులపెై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు.


ఈ సంవత్సరం కోడిపందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న ఇరు గ్రామాల నిర్వాహకుల మధ్య తగాదా ఏర్పడడంతో జిల్లా మంత్రి ఒకరు ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అలాగే తమతమ గ్రామాలలో పేకాటలు, గుండాటలు నిర్వహించడానికి రూ.10 లక్షలు పాటసొమ్ము చెల్లించాలని నిర్వాహకులు పట్టుబట్టడం విశేషం. కోట్లలో జరిగే ఈ పందాలను గత సంవత్సరం మంత్రులు, ఎంపీలు దగ్గరుండి పందేలు జరిపించడం గమనార్హం. ప్రతీ సంవత్సరం సంక్రాంతి మూడు రోజులలో ఐ.పోలవరం, కాట్రేనికోన, సఖినేటిపల్లి, రావులపాలెం, అల్లవరం మండలాలలో కోట్లాది రూపాయలు పందాలు పేరుతో చేతులు మారడం రివాజుగా మారింది. మారుమూల లంక గ్రామాలలో సైతం కూర పందేలు పేరుతో పందేలు జరుగుతున్నా పోలీసు అధికారులకు పట్టవు. నిర్వాహకులు ఇచ్చే మామూళ్లమత్తులో మునుగుతూ చూసిచూడనట్లు నటించడం కొందరు అధికారులకు అలవాటుగా మారింది. గతంలో బత్తెన శ్రీనివాస్‌ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు కోడిపందెంరాయుళ్లపెై ఉక్కుపాదం మోపారు. కానీ ఆయన అనంతరం పోలీసు అధికారులు పండుగరోజులలో ఉదారత చూపడం ఆనవాయితీగా మారింది.


అమలాపురం డివిజన్‌ పరిధిలో 47 మంది కోడిపందెంరాయుళ్లపెై బెైండోవర్‌ కేసులు నమోదు చేసామని డీఎస్పీ తెలిపారు. కోడిపందాలపెై ఉక్కుపాదం మోపుతామని మైకుల ద్వారా, కరపత్రాల ద్వారా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. పందెం నిర్వాహకులపెై పందెం జరుగుతున్న స్థల యజమానులపెై, కోళ్లకు కత్తులు కడుతున్న వారిపెై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. యథప్రకారం ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కోనసీమలో కోళ్లు కూస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి. కోనసీమలో పందెంరాయుళ్లు ఉవ్విళ్లూరుతూ ఉత్సాహంగా పందేలలో పాల్గొంటూ పోలీసులు తమను ఏమీచేయలేరని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
కోడి గెలిచింది ఓడిందెవరు ?
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత రసవత్తరంగా కోడిపందాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం మధ్య పోలీసులు అనుమతి ఇస్తారా ? లేదా ? అనే సందిగ్ధ వాతావరణం మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. చివరకు ప్రజాప్రతినిధుల వత్తిడి వలన పోలీసు శాఖ చేతులెత్తేయక తప్పలేదు. ఉదయం 10.30 గంటలకు పోలీసు శాఖ నుంచి పరోక్ష అనుమతి లభించిన అనంతరం పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించారు.
జిల్లా పందాలకు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
 రాక్షస క్రీడపై పోలీస్‌ ఓడింది. రాజకీయం గెలిచింది. ఎట్టిపరిస్థితుల్లో కోడి పందేలు పోటీలు జరగబోనివ్వమని జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు, ఏకంగా ఏలూరు రేంజ్‌ డిఐజి సూర్యప్రకాశరావు కోడి పందాలుపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన వారి మాటలు బేఖతారైయ్యాయి. రాష్ట్రంలో నెలకున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితి కోడిపందాలకు రాజమార్గంగా మారాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పట్టుదలతో కోడిపందాలు నిర్వహించారు. స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలు కోడి పందాల్లో పాల్గొనడం మరింత విశేషం. ఉదయం 10గంటల వరకు కోడి పందాలు నిర్వహణపై సస్పెన్‌షన్‌ కోనసాగింది. భీమవరంలో పోలీసులు కోడి పందాలు నిర్వహించే బరి వద్ద మోహరించారు. ఏది ఏమైన రాజకీయ నాయకులు ఒత్తిడితో కోడి పందాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలసి వచ్చింది. ముఖ్యంగా డెల్టాలో ఉదయం 11గంటల నుంచి కోడిపందాలు ఊపందుకున్నాయి. ఒక్క చింతలపాటి దొడ్డిలోనే కోటి రూపాయలు వరకు పందాలు సాగాయి. కోడి పందాల నిర్వహణకు మాజీ వైస్‌ చైర్మన్‌ భీమవరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కార్లు వెళ్ళడానికి రోడ్డును అభివృద్ధి పరిచారు.


ప్రత్యేకంగా కార్‌ పార్కింగ్‌, మందు బాబులకు బెల్ట్‌ షాపు,శాఖాహార ప్రియులకు కోడి మాంసం దుకాణాలు, పలావ్‌ సెంటర్లు, గుండు ఆటలు, పేకాట, లోపల బయట, కూల్‌డ్రింక్‌ షాపులు, పందాలుకు అనుమతి ఇచ్చిన అరగంట లోనే వెలిచాయి. చింతలపాటి దొడ్డిలో మొదటి పందెం రూ.1లక్షతో ప్రారంభమైన పందాలు కోట్లరూపాయల వరకు వెళ్ళాయి. ఈ పందాలను వీక్షించడానికి విదేశాల్లో స్థిరపడ్డా ఎన్‌అర్‌ఐలు, వారి బందువులు జోష్‌గా కోడి పందాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌, వైజాగ్‌, విజయవాడ తదితర పట్టణాల్లో స్థిర పడ్డా వ్యాపారస్తులు, ఉద్యోగులు కోడి పందాలకు తరలివచ్చారు. పాలకొల్లు, భీమవరం, నర్సాపురంలలో నిర్వహించే పందాలకు మెడ్చర్ల ఎమ్మెల్యే ఆకుల రాజారెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్‌,మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజేంద్ర,పటన్‌చెరువు ఎమ్మెల్యే మల్లేశ్వరగౌడ్‌లు హాజరైయ్యారు.


తెంగాణకు చెందిన 4గురు టఇర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆంధ్రా ప్రాంత పందాలకు హాజరుకావడం చ ర్చనీయంశమైంది. డిసిసి మాజీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు,అలిండియా స్టీల్‌ కన్యూమర్‌ మెంబర్‌ చిలుకూరి నరసింహరాజు,డిఎన్‌అర్‌ కళాశాల పాలక వర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకటనరసింహరాజు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వెంపలో ఏర్పాటు చేసిన కోడి పందాలకు పటాన్‌చెరువు ఎమ్మెల్యే మల్లేశ్వరగౌడ్‌, భీమవరంలో ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ, యండగండి కోడిపందాల్లో కృష్ణుడు(వినాయకుడు ఫేం) తదితరులు విచ్చేశారు. ప్రవాస భారతీయుల కుటుంబాలకు మహిళలు ప్రత్యేకంగా విచ్చేసి కోడిపందాలు బెట్టల్‌ పట్టడం విశేషం. డేగా, కాకి, పర్ల అంటూ ఒకటి రెళ్ళు హెచ్చు అంటూ నానా హంగామా చేశారు. మండలంలోని వెంప గ్రామంలో విస్తృతంగా పందాలు సాగాయి. అక్కడ కూడా టెంట్‌లను ఏర్పాటు చేసి బరిలను గీసారు.


కాళ్ళ మండలంలోని కాళ్ళకూరు,మాలవాని తిప్ప,మోడి, ఎల్‌ఎన్‌పురం, ఉండిమండలం మహదేవపట్నం, యండగండి, ఆకివీడు మండలంలో ఐభీమవరంలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగాయి. ఈ బరికి ఆంధ్రా కోడిపందాలుగా చెబుతుంటారు. చాలామంది ప్రముఖులు ఈ పందాలకు హాజరౌతారు. జిల్లాల్లో భీమవరం, ఐభీమవరంలోనే కోట్లల్లో పందాలు సాగుతాయి. అదేవిధంగా కుప్పనపూడి, మాదివాడ, దుంపగడప, అప్పారావుపేట, సిద్దాపురం గ్రామాల్లో పందాలు జరిగాయి. పెద్దపందాలు జరిగే బరిలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి రాత్రి 9గంటల వరకు పందాలు నిర్వహిస్తున్నారు. ఇక గుండాట,పేకాటలకైతే రాత్రింబవళ్ళు జరుగుతాయి. నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు దగ్గర ఉండి పందాలు నిర్వహించారు.


ప.గో.జిల్లాకు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేల రాక : ఒకవైపున రాష్ర్తంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల స్థాయి ఉధృతమై, ఇరు ప్రాంత నేతలు కత్తులు దూసుకుంటున్న సమయంలో సంక్రాంతి పండుగ సమైక్య గీతానికి శ్రీకారం చుట్టినట్టయ్యింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, యలమంచిలి మండలాలలో భారీ స్థాయిలో జరుగుతున్న కోడపందాలకు హాజరు కావడం విశేషం. సినీ నటులు ఎమ్మెస్‌ నారాయణ, వినాయకుడు ఫేం హీరో కృష్ణుడు కోడిపందాలు తిలకించి, ప్రజలను ఉత్తేజపరిచారు. తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు ఆంధ్రప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలకు హాజరుకావడం రాష్ర్టవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


సంక్రాంతి సెలవుల కారణంగా ఆహ్లాదంగా, ఉల్లాసంగా గడపడానికి, సరికొత్త వాతావరణంలో ప్రజలను కలుసుకోవడానికి వచ్చామని, తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం. వారిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం మరో విశేషం. కాగా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ప్రత్యేకంగా కోడిపందాల నిర్వహణ కోసం కొబ్బరితోటను నరికి వేసి, శుభ్రంచేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో షామియానాలతో అలంకరించి అక్కడ జోరుగా పందాలు నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కోడిపందాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.


తెలంగాణా ఎమ్మెల్యేలు వీరే : తెలంగాణా ప్రాంతానికి చెందిన ఖుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, మేడిచర్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజారెడ్డి కోడిపందాలకు హాజరయ్యారు. వీరు భీమవరం సమీపంలోని ప్రకృతి ఆశ్రమం వద్ద గల చింతలపాటి దొడ్డిలో జరిగిన కోడిపందాలకు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలోని యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో జరిగిన కోడిపందాల్లో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్‌ మేకా శేషుబాబు పాల్గొనగా, దెందులూరు నియోజకవర్గం పరిధిలోని కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన స్వంత గ్రామమైన పోలవరం నియోజకవర్గంలోని దుద్దుకూరులో జరిగిన కోడిపందాలలో పాల్గొన్నారు.


చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ చింతలపూడి ఆ నియోజకవర్గంలో జరిగిన పందాలలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని శ్రీనివాసపురంలో జరిగిన కోడిపందాలను జిల్లా ఎంపిటిసిల చాంబర్‌ అధ్యక్షులు పోలినాటి బాబ్జీ ప్రారంభించగా, పంగిడిగూడెం రోడ్డులో జరిగిన కోడిపందాలలో జంగారెడ్డిగూడెం సర్పంచ్‌ మండవల్లి విజయ్‌సారధి కొబ్బరికాయ కొట్టి పోటీలను ప్రారంభించారు.


పేకాట, గుండాట, మద్యం జోరు - ధరల హోరు : భీమవరం, ఆకివీడు మండలంలోని ఐ.భీమవరం, ఉండి మండలంలోని మహదేవిపట్నం, యండగండిలో జరిగిన కోడి పందాలకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ ప్రాంతానికి చెంది అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలలో స్ధిరపడిన ఎన్‌ఆర్‌ఐలు ఎంతో ఆసక్తిగా కోడిపందాలలో పాల్గొని పై పందాలు కాశారు. మహిళలు కూడా పందాలలో పాల్గొని, పై పందాలు 10 వేల నుండి 50 వేల రూపాయల వరకు వేయడం కన్పించింది. విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌, గుంటూరు జిల్లాల నుంచి భారీ స్థాయిలో వ్యాపారస్తులు, కొందరు రైతులు వచ్చి పై పందాలు కాశారు.


వీరు ముందుగానే లాడ్జీలు బుక్‌ చేసుకోవడంతో అన్నీ నిండిపోయాయి. కోడిపందాలు నిర్వహించే చోట వందలాది కార్లు, వేలాది ద్విచక్రవాహనాలతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఈ విధంగా తొలిరోజే ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులు రాత్రింబవళ్ళు ఈ పోటీలు జరగడానికి ఏర్పాట్లు చేశారు. పేకాట, గుండాట, ఇతర జూదాలు జరుగుతున్నాయి. అక్కడ మద్యం ఏరులై పారింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచారు.


కూల్‌డ్రింక్‌, ఇతర వస్తువుల ధరలు కూడా భారీస్థాయిలో పెంచారు. కోడిపందాలు నిర్వహణ ఏవిధంగా ఉంటుందా ? అని అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. చివరకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలోని పెద్దలపై ప్రతీ ఏటా ఒత్తిడి తెచ్చిన విధంగానే చేసి, అనుమతి సాధించి, విజయం సాధించినట్లయింది. కోడిపందాలు మరో మూడు రోజులు ముమ్మరంగా, మరో పది రోజులు సాధారణంగా జరిగే పరిస్ధితులు ఉన్నాయి. పోలీసులు గస్తీ చర్యలు చేపట్టినా చివరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉండిపోయారు. కోడిపందాలను నిలువరించే అవకాశం లేక, శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో గస్తీ చర్యలు చేపడుతున్నారు.
ఖాకీపై గెలిచిన కాకి 
సంక్రాంతి కోడిపందాల్లో ఖాకీపై మరో సారి కాకి గెలిచింది. రాజకీయ నేతల, ప్రజాప్రతినిధుల తీవ్ర ఒత్తిళ్లతో ఎట్టకేలకు పోలీసు ఖాకీ తలవంచక తప్పలేదు. సంక్రాంతి కోడి పందాల నిరోధానికి విస్తృతంగా దాడులు చేస్తామని ప్రగల్భాలు పలికిన ఖాకీ కంఠం మూగబోయింది. అనధికారిక అనుమతులుతో పోలీసు యంత్రాంగం సంక్రాంతి సాంప్రదాయక కోడిపందాల శిబిరాల దరిదాపులకే పోలేకపోయింది. తిరునాళ్లను తలపించేలా జనం తండోప తండాలుగా కోడిపందాలను చూసేందుకు ఎగబడ్డారు. డెల్టా ప్రాంతంతో పాటు ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలోనూ కోడిపందాలు జోరందుకున్నాయి. భోగి రోజైన శుక్రవారం ఆరంభమైన మూడు రోజుల పందాల జాతరకు చాలా చోట్ల అనుకున్నట్లుగానే ముహూర్తపు షాట్‌లను కొట్టేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు పలువురు అమితాసక్తిని చూపారు. కొన్ని చోట్ల ఉదయం పది గంటల్నుండే తెరతీయగా, మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి ఈ సంప్రదాయ ముసుగులోని కోడిపందాలు ఆరంభమయ్యాయి. పడతులు సైతం ఈ కోడిపందాలు చూసేందుకు వస్తుండటం కొసమెరుపు.
ఇదో రాక్షస క్రీడ... : పౌరుషానికి పెట్టింది పేరుగా కోడిపందాలు నిలుస్తాయి. కాళ్లకు కత్తులు కట్టుకుని ఒకదానిపైకి ఇంకొకటి కాలు దువ్వటం... ప్రాణం తీయటమో, లేక ప్రాణం పోగొట్టుకోవటమో చేసేంత వరకూ బరిలో దిగిన కోడిపుంజులు వెనకంజ వేయవు. రక్తం ఓడుతూ తుది శ్వాస వీడేంత వరకూ పోరాట పటిమను చూపే ఈ కోడిపుంజులను చూస్తూ బెట్టింగ్‌ ట్టిన పందెం రాయుళ్లు ఈలలు చప్పట్లుతో ఆనందించడం హృదయ విదారకంగా ఉంటుంది. క్షణాల్లో పూరెతైపోయే ఒక్కొక్క ఈ కోడిపందెంలో లోపల పందాలు లక్షల్లో ఉంటుండగా, బయట పందెంగా కాసే వాళ్లు మాత్రం మరెన్నో లక్షల రూపాయలను బెట్టింగ్‌గా కాస్తుంటారు.


వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంపన్నులు సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఈ కోడిపందాలపై బెట్టింగ్‌లు కట్టేందుకు కోట్ల రూపాయలతో పొరుగు జిల్లాల్నుండి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తుంటారు. కొత్త అల్లుళ్ల మాదిరిగా జిల్లాకు చెందిన రాజకీయ కుటుంబాల రాయుళ్లు సంక్రాంతి పందాలు చూసేందుకు తమ , తమ ఏరియాలకు రావాల్సిందిగా రాష్ట్రం న లుమూలలా ఉన్న తమ సన్నిహితులను ఘనంగా ఆహ్వానిస్తుండటం రివాజుగా మారింది.


నేటి సంక్రాంతి రోజున మరింత జోరందుకోనున్న పందాలు :భోగి రోజున ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన కోడిపందాలు సంక్రాంతి రోజైన నేటి శనివారం రాజకీయ, సినీ ఇండస్ట్రీలకు చెందిన వివిఐపిల రాకతో మరింత సందడి చేస్తాయనే ప్రచారం ఊపందుకుంది. సినిమా రంగంతో సన్నిహిత సంబందాలున్న వారెందరో మన జిల్లాలో ఉన్నారు. అంతే కాదు సినీరంగాన్ని శాసించిన, శాసిస్తున్న వారిలో మరెందరో మన జిల్లాకు చెందిన వారు కావడంతో సంక్రాంతి కోడిపందాలు ప్రతి సారీ సరికొత్త అందాలను అద్దుతోంది. పారిశ్రామిక వేత్తలు, అమాత్యుల కుటుంబాలకు చెందిన వారు పలువురు కూడా సంక్రాంతి సరదా కోడిపందాలు తిలకించి ఆనందించేందుకు ఏజెన్సీ, మెట్టకు సైతం వస్తుండటం విశేషం.


రిబ్బన్‌ కటింగ్‌లకు దూరంగా ఉన్న నేతలు :ఈ సారెందుకనో తెలియదు కాని గతంలో మాదిరిగా సంక్రాంతి కోడిపందాలకు ప్రజాప్రతినిధులు, అగ్రశ్రేణి రాజకీయ నేతలు పందాల రిబ్బన్‌ కటింగ్‌లకు దూరంగా ఉండిపోయారు. ఐతే పలు చోట్ల జరిగిన ఈ పందాల్లో మాత్రం వీరు సెంటర్‌ ఎట్రాక్షన్‌గా నిలిచి కనిపించారు. గతంలో రెండు సార్లు ఒరుసగా శ్రీనివాసపురం, దుద్దుకూరు గ్రామాల్లోని కోడిపందాలకు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభోత్సవాలు సాగించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాత్రం ఈ సారి ఈ తరహా ప్రారంభోత్సవాలకు దూరంగా ఉన్నారు. బుట్టాయగూడెం మండలంలోని దుద్దుకూరు గిరిజన గ్రామంలో బోగి రోజున ఆరంభమైన పందాల్లో ఎమ్మెల్యే, ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్‌ కూడా అయిన తెల్లం బాలరాజు ప్రత్యక్షమయ్యారు. పందెం రాయుళ్లలో కాస్తంత హుషారును రేకెత్తించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలో ప్రతిష్టాకరంగా ఆరంభమైన కోడిపందాలను ఈ ప్రాంతపు రాజకీయ దిగ్గజం , డిసిసిబి ఛైర్మన్‌ కరాటం రాంబాబు రిబ్బన్‌ కట్‌ చేస్తారనే ప్రచారం సాగింది.


ఐతే ఎందు చేతనో ఆఖరి నిముషంలో ఆయన కూడా రిబ్బన్‌ కటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. కడకు శ్రీనివాసపురం కోడి పందాలను జిల్లా ఎంపిటిసిల చాంబర్‌ అధ్యక్షుడు పోల్నాటి బాబ్జీ వీటిని ప్రారంభించారు. అలాగే పంగిడిగూడెం రూట్లో ఏర్పాటైన కోడి పందాలను సర్పంచ్‌ మండవల్లి విజయసారధి కొబ్బరి కాయలు కొట్టి రిబ్బన్‌ కట్‌ చేసి ఆరంభించారు. ఇక పోతే జంగారెడ్డిగూడెం మండలంలోనే ఉన్న నాగులగూడెం పందాలను చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ రిబ్బన్‌ కట్‌ చేసి తెర తీస్తారనే ప్రచారం సాగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే రాజేష్‌ పందాల రాయుళ్లను నిరుత్సాహానికి గురి చేస్తూ రిబ్బన్‌ కటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. గతంలో ఈ తరహా పందాల శ్రీకారానికి ఉత్సాహాన్ని చూపిన ప్రజాప్రతినిధులు, నేతలు పరోక్షంగా ఒకింత ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు సమాచారం.


యథేచ్ఛగా సాగిన జుదశాలలు :అంతా అనుకున్నట్లుగానే జూదశాలలకు రెక్కలు విచ్చుకున్నాయి. ప్రత్యేక గొడౌన్లు, మరి కొన్ని చోట్ల ఆరు బయట ఉన్న తోటల్లోనూ టెంట్‌లు వేసుకుని మరీ మట్కా జూదం విశృంఖలంగా సాగినట్లు సమాచారం. రేయింబవళ్లు లక్షలాది రూపాయలతో పేకాటల శిబిరాలు సాగాయి. రాజు-పేద తారతమ్యం లేకుండా సంక్రాంతి పందాలు, పేకాట శిబిరాలు ముమ్మరంగా కన్పించాయి. చాలా ప్రాంతాల్లో వీటిని అడ్డుకోవాల్సిన ఖాకీలు కేవలం మామూలు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కొందరికి మాత్రం సంక్రాంతి పేరుతో సాగే కోడిపందాలు, పేకాట శిబిరాలు ఆదాయాన్నిచ్చే చక్కటి అవకాశంగా ఉందనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


పండగంటే దండగే : పండగంటే దండగే అనే ధోరణిలో సామాన్య జనం ఆందోళన.. అభిప్రాయపడుతున్నారు. కోడిపందాలు, మట్కా జూదం కారణంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు నిరుపేద కుటుంబాల్లో ఒకింత తత్తరపాటు కన్పిస్తుంది. అసలే రైతన్నకు కలిసి రాని కాలం కావడంతో రైతు-కూలీ వర్గాల చేతుల్లో పైసలాడని పరిస్థితి నెలకుంది. ఐనప్పటికీ పెద్ద పండగ కావడం, ఆ పై కోడిపందాలు, పేకాట దురలవాట్లుతో అందినకాడికల్లా చాలా మంది పేదలు అప్పులు చేసి నష్టపోవడం జరుగుతోంది. సంప్రదాయం ముసుగులో సాగే ఈ కోడిపందాల జాతరను అడ్డుకునేందుకు యత్నించాల్సిన వారే పరోక్షంగా వీటిని ప్రోత్సహించడం విచారకరమని పలువురు వాపోతున్నారు. సంపన్నుల మాటెలా ఉన్నా సరే, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజానీకం మాత్రం పండగ సరదా పేరు చెప్పి చేతులు కాల్చుకుని డీలా పడ్డారు.
పోలీసుల సాక్షిగా...
ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కోడిపందేలు పోలీసులు దగ్గరుండి నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు పందెంరాయుళ్లు, పందేలు నిర్వహించే స్థల యజమానులు, కత్తులు కట్టేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని, ఇప్పటివరకు అమలాపురం డివిజన్‌లో 47మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని నానా హంగామా చేసిన పోలీసు అధికారులకు కోడిపందాలు సిబ్బంది సమక్షంలో యథేచ్ఛగా జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీసింది. అల్లవరం మండలం గోడి, గోడిలంక గ్రామాల మధ్య కోడిపందాల నిర్వహణ విషయమై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా మంత్రి ఒకరు గురువారం ఇరుగ్రామాల మధ్య సఖ్యతకు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ పందాలు నిర్వహణకు మాత్రం పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చి సఫలీకృతం కాగలిగారు. పందాలు విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరుగకుండా అల్లవరం మండల పోలీసులు భారీఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు తప్ప కోడిపందాలు నిర్వహిస్తున్న వారిపై చూసీచూడనట్లు వ్యవహరించడం విశేషం.


కోనసీమలో కోడిపందాలు జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా పండుగ రోజులలో కోడిపందాలు, శాంతిభద్రతలను అదుపుచేయడానికి స్పెషల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది పోలీసు సిబ్బందిని నియమించినా పందాలు నివారించడంలో విఫలమయ్యారు. ప్రతీ గ్రామంలోను పందాలు యథావిధిగానే జరిగాయి. రాజకీయ ఒత్తిళ్లతో కోళ్లు గెలిచి, ఖాకీలు ఓడడం సిగ్గుచేటని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కోడిపందాలు, పేకాట, గుండాటలు నివారించలేని పోలీసులు అతిగా స్పందించి పత్రికా ప్రకటనలకు పరిమితమై, ఆచరణలో విఫలమయ్యారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. గోడిలంకలో పందాలకు పలువురు ప్రజాప్రతినిధులు, మాజీశాసనసభ్యులు హాజరై దగ్గరుండి మరీ పందాలు కాయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత సంవత్సరం కూడా ఇదేమాదిరి ఎంపీతోపాటు పలువురు శాసనసభ్యులు దగ్గరుండి పందాలు ఆడించి పోలీసులకు సవాల్‌ విసిరారు. ఈ సంవత్సరం కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. గోడి, గోడిలంక గ్రామాల మధ్య కోడిపందేల కారణంగా శాంతిభద్రతలు లోపించి ఆస్తినష్టం, ప్రాణనష్టం, మరేవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.  
జోరుగా కోడిపందాలు
గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు లేక గ్రామగ్రామాన జూద క్రీడలు నిర్వహిస్తున్నారు. కోడిపందాలు, చిత్తులాట, పేకాటలు అంతులేకుండా జరుగుతున్నాయి. మండలంలో శాంతిభద్రతలు కల్పించే పోలీసు అధికారి లేక మండలంలో అసాంఘిక కార్యక్రమాలకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో తిరునాళ్ళలో జూదాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు పోలీసు సిబ్బందితో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దొడ్డిదారిన అనుమతిచ్చిన సిబ్బంది ఈ జూదరులకు మెసెంజర్లుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం మొల్లేరు తిరునాళ్ళలోని మోహనాపురం, జడేరు, కొత్తాడ, సూరంపాలెం, జగ్గంపాలెం, బియ్యంపాలెం సరిహద్దుల్లో నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది.
కోట్లకు పడగలెత్తిన కోడిపందాలు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత రసవత్తరంగా కోడిపందాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం మధ్య పోలీసులు అనుమతి ఇస్తారా ? లేదా ? అనే సందిగ్ధ వాతావరణం మధ్య పోటీలు ప్రారంభమయ్యాయి. చివరకు ప్రజాప్రతినిధుల వత్తిడి వలన పోలీసు శాఖ చేతులెత్తేయక తప్పలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి తోట నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట నియోజకవర్గంలో మంత్రి అనుచరులు కోడిపందాలలో ముమ్మరంగా పాల్గొన్నారు.


ఇక్కడ మహిళలు కోడిపందాలకు రావడం విశేషం. కోళ్ళకు హారతులు ఇచ్చి, వీరగంధం పూసి, బొట్టుపెట్టి పందాలకు శ్రీకారం చుట్టడం గమనార్హం. అదేవిధంగా అల్లవరం నియోజకవర్గం పరిధిలో మంత్రి పినిపే విశ్వరూప్‌ అనుచరులు పెద్త ఎత్తున కోడిపందాలలో పాల్గొన్నారు. అమలాపురం ప్రాంతంలోనూ, గోడితిప్ప, గోలిలంక, ముమ్మడివరం ఇతర లంక గ్రామాలలో పాండిచ్చేరి రాష్ర్టంలోని యానాం పరిధిలో మంత్రి మల్లాడి కృష్ణారావు అనుచరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి, పెదపూడి ప్రాంతాలలో విచ్చలవిడిగా కోడిపందాలు నిర్వహించారు. అక్కడ రెండు సామాజిక వర్గాలకు చెందిన ధనవంతులు కోడిపందాలు నిర్వహించారు. పలుచోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కోడిపందాల్లో ఆహ్లాదంగా పాల్గొన్నారు.


ప.గో.జిల్లాకు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేల రాక : ఒకవైపున రాష్ర్టంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాల స్థాయి ఉధృతమై, ఇరు ప్రాంత నేతలు కత్తులు దూసుకుంటున్న సమయంలో సంక్రాంతి పండుగ సమైక్య గీతానికి శ్రీకారం చుట్టినట్టయ్యింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, యలమంచిలి మండలాలలో భారీ స్థాయిలో జరుగుతున్న కోడిపందాలకు హాజరు కావడం విశేషం. సినీ నటులు ఎమ్మెస్‌ నారాయణ, వినాయకుడు ఫేం హీరో కృష్ణుడు కోడిపందాలు తిలకించి, ప్రజలను ఉత్తేజపరిచారు. తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు ఆంధ్రప్రాంతంలో జరుగుతున్న కోడిపందాలకు హాజరుకావడం రాష్ర్టవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి సెలవుల కారణంగా ఆహ్లాదంగా, ఉల్లాసంగా గడపడానికి, సరికొత్త వాతావరణంలో ప్రజలను కలుసుకోవడానికి వచ్చామని, తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు చెప్పడం విశేషం. వారిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం మరో విశేషం. కాగా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ప్రత్యేకంగా కోడిపందాల నిర్వహణ కోసం కొబ్బరితోటను నరికి వేసి, శుభ్రంచేసి, ఫ్లడ్‌లైట్ల వెలుగులో షామియానాలతో అలంకరించి అక్కడ జోరుగా పందాలు నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కోడిపందాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.


తెలంగాణా ఎమ్మెల్యేలు వీరే :  
తెలంగాణా ప్రాంతానికి చెందిన ఖుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, మేడిచర్ల నియోజకవర్గ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజారెడ్డి కోడిపందాలకు హాజరయ్యారు. వీరు భీమవరం సమీపంలోని ప్రకృతి ఆశ్రమం వద్ద గల చింతలపాటి దొడ్డిలో జరిగిన కోడిపందాలకు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలోని యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో జరిగిన కోడిపందాల్లో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, పశ్చిమ గోదావరి జడ్పీ చైర్మన్‌ మేకా శేషుబాబు పాల్గొనగా, దెందులూరు నియోజకవర్గం పరిధిలోని కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన సొంత గ్రామమైన పోలవరం నియోజకవర్గంలోని దుద్దుకూరులో జరిగిన కోడిపందాలలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ చింతలపూడి ఆ నియోజకవర్గంలో జరిగిన పందాలలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని శ్రీనివాసపురంలో జరిగిన కోడిపందాలను జిల్లా ఎంపిటిసిల చాంబర్‌ అధ్యక్షులు పోలినాటి బాబ్జీ ప్రారంభించగా, పంగిడిగూడెం రోడ్డులో జరిగిన కోడిపందాలలో జంగారెడ్డిగూడెం సర్పంచ్‌ మండవల్లి విజయ్‌సారధి కొబ్బరికాయ కొట్టి పోటీలను ప్రారంభించారు.


పేకాట, గుండాట, మద్యం జోరు - ధరల హోరు : భీమవరం, ఆకివీడు మండలంలోని ఐ.భీమవరం, ఉండి మండలంలోని మహదేవిపట్నం, యండగండిలో జరిగిన కోడి పందాలకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ ప్రాంతానికి చెంది అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు ఎంతో ఆసక్తిగా కోడిపందాలలో పాల్గొని పై పందాలు కాశారు. మహిళలు కూడా పందాలలో పాల్గొని, పై పందాలు 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వేయడం కన్పించింది. విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌, గుంటూరు జిల్లాల నుండి భారీ స్థాయిలో వ్యాపారస్తులు, కొందరు రైతులు వచ్చి పై పందాలు కాశారు. వీరు ముందుగానే లాడ్జీలు బుక్‌ చేసుకోవడంతో అన్నీ నిండిపోయాయి. ఈ విధంగా తొలిరోజే ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్ధాయిలో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. మరో మూడు రోజులు రాత్రింబవళ్ళు ఈ పోటీలు జరగడానికి ఏర్పాట్లు చేశారు. పేకాట, గుండాట, ఇతర జూదాలు జరుగుతున్నాయి. అక్కడ మద్యం ఏరులై పారింది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచారు. కూల్‌డ్రింక్‌, ఇతర వస్తువుల ధరలు కూడా భారీస్థాయిలో పెంచారు. పోలీసులు గస్తీ చర్యలు చేపట్టినా చివరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

No comments:

Post a Comment